సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఓట్లు ఆయన దక్కించుకున్నారు.
బ్రిటన్ కేబినెట్‌లో మరో భారతీయ సంతతికి చెందిన మహిళ చేరనున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషీ సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్ కౌటినో ను ఇంధనశాఖ మంత్రిగా గురువారం ప్రధాని రిషి సునాక్ నియమించారు.
అప్పుడే పుట్టిన ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను తీసింది ఓ నర్సు. తన వృత్తికే కాదు.. మానవత్వానికి మచ్చ తీసుకొచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న లూసీ లెట్బీ అనే నర్సు.. ఏడుగురు నవజాత శిశువులను హత్య చేయగా.. మరో ఆరుగురు చిన్నారులను హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది.
Ireland Prime Minister : భారతీయ సంతతికి చెందిన లియో వరాడ్కర్ ఐర్లాండ్ ప్రధానమంత్రిగా శనివారం రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. రొటేషన్ పద్ధతిలో ఫిన్ గేల్ పార్టీకి చెందిన వరాద్కర్ మరోసారి ఎన్నికయ్యారు.
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు… భారత్ దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న సోమవారం రోజు ఈ వార్త తెలియడంతో.. భారతీయులు మరింత జోష్‌గా ఉత్సవాలు నిర్వహించారు.. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి చెందిన నేత రిష్ సునాక్ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన మామ, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి… సోషల్ మీడియాలో తన…