US Car Crash: ఐదు రోజుల క్రితం అమెరికా రోడ్డు ప్రమాదంలో అదృశ్యమైన భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్లు ఆదివారం మార్షల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. 80 ఏళ్ల వయసు ఉన్న సీనియర్ సిటిజన్ కూడా ఈ కారు ప్రమాదంలో మరణించారు. వీరు ప్రయాణిస్తున్న టయోటా క్రామీ వాహనం బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డు వెంబడి లోతుగా ఉన్న ఒక ప్రాంతం నుంచి బాధితులు, ప్రమాదానికి గురైన కారును పోలీసులు కనుగొన్నారు. శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వీరిని కనుగొన్నారు. సహాయక సిబ్బంది సంఘటన స్థలంలో ఐదుగంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు రోజులుగా పోలీసులు వీరి కోసం హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Read Also: Russia: ఓ వైపు 7.0 భూకంపం.. మరోవైపు 600 ఏళ్ల తర్వాత క్రషెనినికోవ్ అగ్ని పర్వతం విస్ఫోటనం..!
మరణించిన వ్యక్తులను ఆశా దివాన్(85), కిషోర్ దివాన్(89), శైలేష్ దివాన్(86), గీతా దివాన్(84)గా గుర్తించారు. న్యూయార్క్ లోని బపలో నుంచి వెస్ట్ వర్జీనియాలోని మార్షల్ కౌంటీలో ఉన్న ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అనే ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చివరి సారిగా వీరు జూలై 29న పెన్సిల్వేనియాలోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో కనిపించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలో ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు రెస్టారెంట్‌లోకి వెళ్లడం రికార్డైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం, వీరు పిట్స్ బర్గ్ నుంచి మౌండ్స్ విల్లే(వెస్ట్ వర్జీనియా)కు వెళ్లాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు.