Indian Navy: బంగ్లాదేశ్ సంక్షోభం, ఈ ప్రాంతంలో అస్థిరత పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి భారత నావికాదళం టాప్ కమాండర్లు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
INS Arighat: అణుశక్తితో నడిచే భారతదేశ రెండో జలంతర్గామి రేపు ప్రారంభించబడనుంది. ఐఎన్ఎస్ అరిఘాత్ అణుశక్తితో నడిచే రెండో బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి. అరిఘాట్‌ని రేపు విశాఖపట్నంలో ప్రారంభించే అవకాశం ఉంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రారంభోత్సవానికి కావాల్సిన సన్నాహాలు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం బలమైన గాలులకు కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గత ఏడాది (4 డిసెంబర్ 2023) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనపై భారత నౌకాదళం విచారణకు ఆదేశించింది. ఈ విగ్రహాన్ని గతేడాది నేవీ డే రోజున ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు చేపట్టేందుకు ఒక బృందాన్ని నియమించినట్లు తెలిపారు.
తీవ్రరక్తస్రావమై ప్రమాదంలో ఉన్న చైనీయుడిని సాహసోపేతమైన ఆపరేషన్ చేసి ఇండియన్ నేవీ రక్షించింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెయింటెనెన్స్‌లో ఉన్న ఇండియన్ నేవీ యుద్ధనౌకలో సోమవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నావికాదళానికి చెందిన జూనియర్ నావికుడు తప్పిపోయాడని, రెస్క్యూ టీమ్ అతని కోసం వెతుకుతోందని అధికారులు చెప్పారు.
భారత సైన్యం చరిత్రలో తొలిసారిగా అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రులు ఆర్మీ, నేవీకి చీఫ్ లుగా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అనే ఇద్దరు సహవిద్యార్థులు భారత సైన్యం నావికాదళానికి చీఫ్‌లుగా నియమితులయ్యారు.
Kaamya Karthikeyan: ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక కామ్య కార్తికేయన్ విజయవంతంగా మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించి రికార్డ్ సృష్టించింది. నేపాల్ వైపు నుంచి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయసు కలిగిన భారతీయురాలిగా ఈ ఘనత సాధించినట్లుగా భారత నావికాదళం గురువారం తెలిపింది.
Indian Navy: హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి తర్వాత పనామా జెండాతో కూడిన నౌకకు భారత నావికాదళం వేగంగా సహాయం చేస్తుంది. నేవీ సత్వర స్పందన కారణంగా, 22 మంది భారతీయులతో సహా 30 మంది సిబ్బంది ప్రాణాలు రక్షించబడ్డాయి.
వాయువ్య హిందూ మహా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటుతో పాటు అందులో సిబ్బందిని కూడా రక్షించింది. కాగా, బోటులో ఉన్న వారు పాకిస్థాన్‌కు చెందిన 23 మంది సిబ్బంది అని భారత నేవీ అధికారులు తెలిపారు.