ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లు తీయడంతో పాటు నిలకడగా 150 కి.మీల వేగంతో బంతులు వేయడంతో.. రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో అతడ్ని టీమిండియాలోకి తీసుకోవాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు మాజీలు సైతం అతడ్ని తుది జట్టులో ఎంపిక చేయాల్సిందేనని సిఫార్సు చేస్తున్నారు. అయితే.. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ క్రీడా ఛానల్ చర్చలో భాగంగా ఉమ్రాన్ గురించి మాట్లాడుతూ..…
భారత క్రికెట్ జట్టుకు ఒక్కసారైనా ఆడాలని ప్రతి క్రికెటర్‌కూ కోరిక ఉంటుంది. అందుకోసం వాళ్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. కానీ, అందరికీ అవకాశాలు అంత సులువుగా దొరకవు. సెలక్టర్లకూ ఎవరిని ఎంపిక చేయాలన్నది పెద్ద ఛాలెంజ్‌తో కూడుకున్న పని. అయితే.. కొందరు మాత్రం ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారని అప్పుడప్పుడు ఆరోపణలు వస్తుంటాయి. తాజాగా భారత వెటరన్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ కూడా ఓ సెలక్టర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. 30 ఏళ్లు…
భారత క్రికెట్ జట్టులో ఒక్కసారైనా ఆడాలని క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడే ప్రతీ ఒక్కరి కల. అయితే ఆ అదృష్టం అందరికి దక్కదు. చాలా తక్కువమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అయితే కేవలం రెండేళ్లలో తాను భారత జట్టుకు ఆడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు IPL క్రికెటర్ అశ్విన్ హెబ్బార్. ఇందులో భాగంగానే త్వరలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జరగబోతోంది. ప్రస్తుతం ఆ మ్యాచ్ లకు ప్రిపేర్ అవుతున్నానని చెబుతున్నాడు ఈ IPL క్రికెటర్. IPL…
ఈ ఏడాది ఐపీఎల్లో దినేశ్ కార్తీక్ ఎలా చెలరేగిపోతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా.. ఎన్నో మెరుపులు మెరిపించాడు. చాలాసార్లు జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. మునుపెన్నడూ లేని రౌద్ర రూపం దాల్చి, మైదానంలో తాండవం చేస్తున్నాడు. ఆర్సీబీ జట్టుకి బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. ఈ నేపథ్యంలోనే.. కార్తీక్‌ను తిరిగి టీమిండియాలో తీసుకోవాల్సిందిగా మద్దతులు లభిస్తున్నాయి. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి.. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కార్తీక్‌ను…
త్వరలో సౌతాఫ్రికాతో జరగపున్న సిరీస్ నుంచి విరాట్ కోహ్లీని తొలగించనున్నారా? అంటే దాదాపు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి కోహ్లీ ఫామ్‌లో లేడన్న విషయం అందరికీ తెలుసు. అతడు సెంచరీ చేసి రెండేళ్ళ పైనే అవుతోంది. అప్పుడప్పుడు కొన్ని పర్వాలేదనిపించే ఇన్నింగ్స్ ఆడాడు కానీ, వింటేజ్ కోహ్లీని తలపించే భారీ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అయితే ఘోరంగా విఫలమయ్యాడు. మూడుసార్లు గోల్డెన్ డక్ అవ్వడమే కాదు, ఏ…