Dinesh Karthik Picks A Star Cricketer As Most Important Player: సాధారణంగా టీమిండియాలో కీలక ఆటగాళ్లు ఎవరని ప్రశ్నిస్తే.. చాలామంది సీనియర్ ప్లేయర్లే పేర్లనే ప్రస్తావిస్తారు. వారికున్న అనుభవం, ట్రాక్ రికార్డ్, అనుబంధం దృష్ట్యా.. సీనియర్ల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ.. కొందరు మాత్రం అందుకు భిన్నంగా ఎవ్వరూ ఊహించని పేర్లు ప్రస్తావిస్తూ.. వారిపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. వాళ్లే లేకపోతే.. టీమిండియా సర్వైవ్ అవ్వడం కష్టమని కొనియాడుతుంటారు. ఇప్పుడు టీమిండియా వెటరన్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా అలాగే ఓ ఆసక్తికరమైన ఆటగాడ్ని ప్రస్తావించాడు. ఇంతకీ, అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. ఓవైపు ఆటగాడిగా దూసుకెళ్తూనే, మరోవైపు టెంపరరీ కెప్టెన్‌గా సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న హార్దిక్ పాండ్యా. క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇప్పుడున్న ఆటగాళ్లలో ఎవరు కీలక ప్లేయర్ అని దినేశ్ కార్తీక్‌కి ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది. అందుకు అతడు ఏమాత్రం తడబడకుండా హార్దిక్ పాండ్యా పేరు చెప్పాడు. అందుకు గల కారణాలేంటో కూడా వివరించాడు.
Sreemukhi: అయితే క్లివేజ్.. లేకపోతే థైస్.. ఏంటి పాప ఈ చూపించడం
దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఉన్న భారత జట్టులో హార్దిక్ పాండ్యా అత్యంత కీలకమైన ఆటగాడు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే.. అతడు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించగలడు. మన టీమిండియాలో భారత జట్టులో ఇద్దురు, ముగ్గరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. కానీ.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో హార్దిక్ ఒకడు. పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. మిడిలార్డర్‌లో పాండ్యా ముఖ్యమైన ఆటగాడు. చాలా మ్యాచ్‌ల్లో అతడు తన బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అంతేకాదు.. బౌలింగ్‌లోనూ తెలివిగా వ్యవహరిస్తాడు. ఎక్కువ షార్ట్ బాల్స్ వేస్తూ.. బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. రీసెంట్‌గా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలో మిచెల్ మార్ష్‌ను ఓ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ట్రావిస్ హెడ్‌ని కూడా పుల్ షాట్ ఆడించి, వికెట్ కోల్పోయేలా చేశాడు. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు భారత జట్టుకు చాలా అవసరం. అతడు జట్టులో లేకపోతే టీమిండియా రాణించడం చాలా కష్టం’’ అంటూ చెప్పుకొచ్చాడు.
South Africa vs West Indies: టీ20ల్లో వరల్డ్ రికార్డ్.. 259 లక్ష్యాన్ని ఛేధించిన సౌతాఫ్రికా