కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రివిద దళాల్లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వాళ్లని అగ్నివీర్లుగా పిలుస్తున్నారు. అయితే ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణలతో మండిపోతోంది. మైయిటీ, కూకీల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. ఇదిలా ఉంటే గురువారం మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లారు. అయితే ఆయన పర్యటనపై ఆల్ మణిపూర్ స్టూడెంట్ యూనియన్(AMSU) ఆగ్రహం వ్యక్తం చేసింది.
మణిపూర్‌లో జరుగుతున్న హింసను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా ప్రభుత్వాల ప్రయత్నాలు సఫలం కావడం లేదు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) నాయకురాలు మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం రోజున 50 ఆర్‌ఆర్‌కు చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి ప్రవేశించి, అక్కడి ముస్లింలను ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. రెచ్చగొట్టే విధంగా సైన్యం ప్రవర్తించిందని దీనిపై విచారణ ప్రారంభించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైనీని ఆమె కోరారు.
సిక్కింలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం మధ్య భీకర కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా, కొండచరియలు విరిగిపడటంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కుయుక్తులు పన్నుతూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను దాటించి ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సరిహద్దును ఆనుకుని పాకిస్తాన్ వైపు ఉగ్రవాదలు లాంచింగ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదును దొరికితే వారిని భారత్ లోకి పంపేందుకు చూస్తోంది పాకిస్తాన్ ఆర్మీ.
Agni Prime Ballistic Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్‌ను తొలిసారిగా పరీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) బుధవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా పరీక్షించింది. గురువారం డీఆర్డీఓ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మిస్సైల్ నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
భారత్ సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు.
Manipur Violence: జాతుల సంఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 80 మందికి పైగా ప్రజలు మరణించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న మణిపూర్ వెళ్లారు. శాంతి స్థాపన కోసం పలు పార్టీలతో సంభాషించారు. మరోవైపు తిరుగబాటుదారుల ముగుసులో ఉగ్రవాదులు గ్రామాలు, ప్రజలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మణిపూర్ సరిహద్దును అనుకుని ఉన్న మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వార్తలు…