సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, భారత్ మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి… కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీ ఆమోదం విషయంలోనూ పెద్ద రచ్చే జరిగింది.. ఇక, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల నుంచి బీజేపీ నేతల వరకు పలువురు ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు మొదట్లో ఆరోపణలు రాగా.. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ట్విట్టర్ సెగ తగిలింది.. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. ట్విట్టర్ ఇండియా ఎండీపై బదిలీ వేటు…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఇండియాలో 40,120 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కి చేరింది. ఇందులో 3,13,02,345 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,227 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 585 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 4,30,254 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ…
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్రం నుంచి గద్దె దించాలనే లక్ష్యంతో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఈనెల 20 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు సమావేశం కాబోతున్నాయి. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించనున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ధరల పెరుగుదల,…
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించేలా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్…అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ…పరుగులు చేశారు. ఇద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే… 126 పరుగుల వద్ద రోహిత్ ఔటయ్యాడు. 145 బంతులాడిన రోహిత్…11 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 83 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ పెవిలియన్ చేరిన తర్వాత…క్రీజులోకి వచ్చిన నయా వాల్ చతేశ్వర్ పూజారా 9…
అమెరికా, భారత్, ఇరాన్, బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లో గత వారం అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని WHO తాజాగా పేర్కొంది. అయితే..భారత్, ఇండియా, ఇండోనేషియాలో ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది. అమెరికాలో కొత్త కేసుల్లో 35 శాతం పెరుగుదల నమోదైందని కూడా పేర్కొంది. ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న కరోనా వేరియంట్ గత వారం కొత్తగా ఏడు దేశాల్లో అడుగుపెట్టింది. దీంతో..డెల్టా కాటుకు గురైన దేశాల సంఖ్య 142కు చేరింది. మరోవైపు.. మునుపటి స్ట్రెయిన్లతో పోలిస్తే ఈ…
అమెరికా-పాక్ దేశాల మధ్య మంచి మైత్రి ఉన్నది. అయితే, ఈ మైత్రి గత కొంతకాలంగా సజావుగా ఉండటంలేదు. పాక్‌లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో పాటుగా, ఆ దేశం చైనాతో బలమైన సంబందాలు కలిగి ఉండటం వలన అమెరికా పాక్ కు దూరమైందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు దశాబ్దాల కాలం క్రితం అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టి తాలిబన్, ఆల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో పాక్ సహకారంలో అమెరికా తాలిబన్ల ఆటకట్టించింది. ప్రస్తుతం అమెరికా-పాక్…
ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాంగంలో కాంస్యపతకం గెలుచుకున్న లవ్లీనాకు అస్సాం ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల నగదుతో పాటుగా, ఆమెకు పోలీసు శాఖల డీఎస్పీ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు, ఆమె నివశించే గ్రామంలో బాక్సింగ్ అకాడెమి ఏర్పాటుతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హామీ ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తరువాత లవ్లీనా ఈరోజు సొంత రాష్ట్రం అస్సాంకు చేరుకున్నది. ఆమెను రీసీవ్ చేసుకోవడానికి…
దేశంలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దక్షిణాదిన కేరళతో పాటు అటు మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. మొదటివేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని తక్కువ కేసులతో బయటపడ్డ ఈశాన్య రాష్ట్రాలు సెకండ్ వేవ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడ కేసులు బయటపడుతున్నాయి. తాజారా మిజోరాం రాష్ట్రంలో 576 కొత్త కేసులు నమోదవ్వగా అందులో 128 మంది చిన్నారులు ఉండటం ఆందోళన…
ఇంగ్లండ్ మరియు టీమిండియా జట్ల మధ్య రెండో టెస్ట్ ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే… ఈ టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది. అయితే.. కాసేపటి క్రితమే.. ఈ మ్యాచ్ టాస్ వేశారు. ఇందులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి… బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. జట్ల వివరాలు : ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్ (సి), జానీ బెయిర్‌స్టో, జోస్…
2021 ఆగస్టు 15తో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్బంగా దేశంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. మనదేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. ప్రతి ఏడాది అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద జాతీయ జెండాను ఎగరవేస్తారు. అయితే, 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది టైమ్ స్క్వేర్ లో అతిపెద్ద జెండాను…