దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అపూర్వ అవకాశం లభించింది. మరోసారి ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ఐక్యరాజ్యసమితి అత్యున్నత జనరల్ అసెంబ్లీ సెషన్లో మాట్లాడనున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు అగ్రభాగం లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధానిగా ఉన్న మోదీ ప్రసంగం కీలకం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి వక్తల జాబితా సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం, వైద్యారోగ్య సేవల్లో కొరత ఏర్పడిన నేపథ్యంలోనే 76వ వార్షికోత్సవ సమావేశం…
బంగారానికి ఉన్న విలువ ప్రపంచంలో మరేదానికి లేదు. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.…
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం గడువు తీరిన వాహనాలను తుక్కుగా మార్చేస్తారు. ఇలా స్క్రాప్‌ను తిరిగి వినియోగించే విధంగా మార్చేస్తుంటారు. గడువు తీరిన వాహనాలు బయట రోడ్లపై తిరుగుతుండటం వలన కాలుష్యం పెరుగుతుంది. ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే కేంద్రం ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల పరిమితి ఉంటే, వాణిజ్యవాహనాలకు పదేళ్ల పరిమితి ఉంటుంది. అయితే, పదేళ్ల తరువాత మరోసారి వీటికి ఫిట్నెస్ టెస్ట్…
అమెరికా అత్యున్నత పురస్కారం జాతిపిత మహాత్మగాంధీకి అందజేయాలని ప్రతినిధుల చట్టసభలో న్యూయార్క్ సభ్యురాలు కరోలిన్ బిమాలోని తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందింది. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అవార్డును అమెరికా అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. ఈ పురస్కారం గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేల, మదర్ థెరీసా, రోసా పార్క్ వంటి గొప్ప వ్యక్తులకు మాత్రమే దక్కింది. కాగా,…
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. డెల్టా వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. థర్డ్‌వేవ్ ముంచుకొస్తుందన్న వార్తలు వస్తున్న క్రమంలో… డెల్టా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ దేశాల్లో కేసులు పెరుగుదలకు డెల్టానే కారణమని WHO పదే పదే చెప్తోంది. ప్రపంచంలో 142 దేశాలు డెల్టా కోరల్లో చిక్కుకున్నాయని ప్రకటించింది. అంతేకాదు భారత్ డేంజర్ లిస్ట్‌లో ఉన్నట్టు తెలిపింది. గామా, బీటాతో పోలిస్తే డెల్టా వెయ్యి రెట్లు అధిక ప్రభావం చూపిస్తోందని హెచ్చరించింది. వారం…
దేశ చరిత్రలో ఆగస్టు 14 వ తేదీని ఎప్పటికీ మర్చిపోలేరు. అఖండ భారతం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు. భారత్, పాక్ విడిపోయిన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని, ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్ గా జరుపుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇండియా పాక్ విభజన సమయంలో రెండు దేశాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు వారి ప్రాంతాలను నుంచి వేరు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో…
తాలిబన్లు 75 శాతానికి పైగా ఆఫ్ఘన్ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాబూల్ మినహా మిగతా భూభాగాలను ఇప్పటికే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్, ఆఫ్ఘన్ ప్రభుత్వాల మధ్య సంధికి ఖతార్ ప్రయత్నాలు చేస్తున్నది. అధికారాన్ని తాలిబన్లతో కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇక, తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని ఇండియాతో సహా 12 దేశాలు స్పష్టం చేశాయి. ఇక ఇదిలా ఉంటే, తాలిబన్ నేతలు ఇండియాపై ప్రశంసలు…
ఇండియాలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. దేశంలో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప టి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.21 కోట్లకు చేరింది. ఇందులో 3,13,38,088 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,87,673 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 478 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం…
ఆఫ్గాన్‌లో పరిస్థితి చేయిజారిపోయింది. ఒక్కో నగరం తాలిబన్ల చెరలో చేరిపోతోంది. ఇప్పటికే 34 ప్రొవిన్షియల్ రాజధానుల్లో 10.. తాలిబన్ల వశమయ్యాయి. ఆ దేశంలోని 65 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా లోగర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. కందహార్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన గంటల్లోనే లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు ప్రకటించారు. తాలిబన్లు చేజిక్కించుకున్న లోగర్ ప్రావిన్స్… ఆ దేశ రాజధాని కాబూల్‌కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా, నాటో సేనలు…