ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 25,166 కేసులు నమోదవ్వగా, 437 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దాదాపు 5 నెలల తరువాత 25 వేల కేసులు నమోదవ్వడం విశేషం. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది. తాజాగా కరోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది.…
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో ఇంగ్గండ్‌పై గెలుపొందింది. దీంతో ఐదు టెస్ట్ల్‌ల సీరిస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించింది టీమిండియా. 298 పరుగులకు గాను….8వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. 272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ….120 లకే ఆలౌటయ్యింది. అయితే రెండో…
ఆఫ్ఘనిస్థాన్ క్రమంగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది.. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు.. అధ్యక్ష భవనాన్ని సైతం స్శాదీనం చేసుకున్నారు.. ఇక, క్రమంగా అన్ని అధికార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కాబూల్‌లో భారత్ నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని సాయుధ తాలిబన్లు ఇవాళ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పీకర్ చైర్లో ఒక తాలిబన్ కూర్చొని టేబుల్‌పై తుపాకీని ఉండగా.. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే స్థానాల్లో మరి కొందరు తాలిబన్లు కూర్చున్నారు.. కాగా, మొన్నటి…
కాబూల్ నుంచి 129 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో వీరంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఫ్ఘన్లో చిక్కుకుపోయిన మన వాల్లను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వెళ్లింది. అయితే, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో ఆందోళన నెలకొంది. అలాగే, కాబూల్ ఎయిర్ పోర్టులో దిగేందుకు అనుమతిచ్చేందుకు ATC అందుబాటులో లేకపోవడంతో మరో ఉత్కంఠకు తెరలేచింది. అదే సమయంలో శత్రువులకు లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో విమాన…
లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ జిడ్డు బ్యాటింగ్ కొనసాగిస్తుండడంతో వికెట్లు తీయడానికి ఇబ్బందిపడ్డ ఇంగ్లాండ్ ఆటగాళ్లు… బంతి ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి… బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కి… ఆకారాన్ని మార్చే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మొహాలు కనిపించకపోవడంతో టాంపరింగ్ చేసిన ఆటగాళ్లు…
ఆగస్టు 14 వ తేదీన పాక్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటే, ఆగస్ట్ 15 వ తేదీన ఇండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నది. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అసేతు హిమాచలం మొత్తం ఈ వేడుకల్లో పాల్గొన్నది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇండియా పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. నిఘాను, భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఆదివారం సాయంత్రం రోజున పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా సనోడా గ్రామంలో పంటపొలాల్లో పాక్ బెలూన్లు కనిపించాయి.…
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 32,937 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 417 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 35,909 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,14,11,924కి చేరగా, 3,81,947 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక భారత్‌లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,31,642కి చేరింది. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే…
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో…భారత్ బ్యాట్స్మెన్లు పోరాడుతున్నారు. నాలుగో రోజు ఆట నిలిచిపోయేసరికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు. రిషభ్ పంత్ 14 పరుగులు, ఇషాంత్ శర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరి రోజు రిషబ్ పంత్ ధాటిగా ఆడి పరుగులు సాధిస్తే….భారత్ ఓటమి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయ్. పంత్‌కు…టెయిలెండర్లు ఎలా సహకారం అందిస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సిడ్నీ…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో తిరిగి ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని ప్రపంచం మొత్తం అందోళన చెందుతున్నది. ఆఫ్ఘనిస్తాన్ చిన్నదేశమే అయినప్పటికి భారత్‌కు మిత్రదేశం. ఆ దేశంలో భారత్ కోట్లాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి జాతీయ ప్రాజెక్టులు, రహదారులు నిర్మించింది. ఇప్పుడు తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘన్ పాలన వెళ్లడంతో దాని ప్రభావం అనేక వస్తువులపై పడే అవకాశం ఉన్నది. ఇండియా నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకునే ఆఫ్ఘనిస్తాన్, ఇకపై ఇండియా నుంచి ఆ వస్తువులను…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. తాజాగా దేశంలో కొత్తగా 36,083 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,92,576 కి చేరింది. ఇందులో 3,13,76,015 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,336 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 493 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం…