ఇండియాలో 90 దశకంలో కైనెటిక్ లూనా ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులకు సైతం ఈ లూనాలు అందుబాటులో ఉండేవి. పెట్రోల్ అయిపోయినపుడు సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు కూడా. అయితే, ద్విచక్రవాహనాల్లో వచ్చిన మార్పులు, చేర్పుల కారణంగా కైనెటిక్ లూనా నిలబడలేకపోయింది. 2000 నుంచి ఈ లూనా ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. కాగా, ఇప్పుడు మరోసారి ఈ లూనాలను విపణిలోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధం అవుతున్నది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ ఫీచర్లతో,…
ఢిల్లీలోని డ్రై ఫ్రూట్స్ మార్కెట్ చాలా ప్రసిధ్ది. దేశంలోని నలుమూలలకు ఢిల్లీ నుంచే డ్రై ఫ్రూట్స్ సరఫరా అవుతాయి. ఆప్ఖనిస్తాన్ తో భారత్ దేశం సుమారు ( 400 మిలియన్ అమెరికన్ డాలర్లు) 4 వేలకోట్ల రూపాయల మేరకు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ నిర్వహిస్తుంది. ఆప్ఘనిస్తాన్ కు భారత్ ఓ పెద్ద మార్కెట్. పాత ఢిల్లీలోని, జమా మసీదు సమీపంలో “ఖారీ బావ్లీ” ప్రాంతంలో ఉన్న డ్రై ఫ్రూట్స్ హోల్ సేల్, రిటైల్ మార్కెట్లు వెలవెలబోతున్నాయు. ఆప్ఘనిస్తాన్…
టీమిండియాతో రేపటి నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్ట్‌కు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఈ ఇంగ్లీష్ పేసర్ గాయపడ్డాడు. మూడో టెస్ట్ సమయానికి అతడు కోలుకుంటాడని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం భావించింది. అయితే వుడ్ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో అతను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.…
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 25,467 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు 3,24,74,773కేసులు నమోదవ్వగా, ఇందులో 3,17,20,112 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 3,19,551 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 354 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,35,110 కి చేరింది.…
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు కలవర పెడుతున్నాయి.. ఇక, మరికొంత మంది భారతీయులు.. అక్కడ చిక్కుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ పరిణామాలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.. ఈ సమావేశంలో తాజా పరిస్థితిని విపక్షాలకు వివరించనుంది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానంగా ఆఫ్ఘన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపైనే కేంద్రం దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇంకా ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు.. వారిని…
తాలిబన్ల అరచకాలు మేం భరించలేం అంటూ ఆఫ్ఘనిస్థాన్‌ను వదిలి వెళ్లేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు.. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లకు తాకిడిపెరిగిపోయింది.. ఇక, ఆయా దేశాలను తమ దేశానికి చెందిన పౌరులను స్వదేశానికి తరలించేందుకు చర్యలను పూనుకుంటున్నాయి.. అందులో భాగంగా.. కాబూల్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన -17 విమానం ఇవాళ భారత్‌కు చేరుకుంది… ఈ విమానంలో 168 మంది భారత్‌కు చేరుకున్నారు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిన విమానం.. ఇవాళ…
కరోనా కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.. మహమ్మారిపై విజయం సాధించడానికి భారత్‌లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 58,14,89,377 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు అధికారులు.. ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్నవారు.. ఫస్ట్ మరియు సెకండ్ డోస్ తీసుకున్నవారు సైతం ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే మరికొంత సమయం పడుతుంది.. అయితే, ఇప్పుడు, ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే కొనసాగుతోంది.. మరోవైపు బూస్టర్ డోస్ (మూడో డోసు)పై కూడా చర్చ…
భారత్ కరోనా పాజిటివ్ కేసులు మరింత తగ్గాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,948 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 403 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఒక, ఒకేరోజులో 38,487 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,24,234కు చేరుకోగా.. ఇప్పటి వరకు 3,16,36,469 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి…
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.. దీంతో.. అక్కడ చిక్కుకున్న మనవాళ్ల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన నెలకొంది.. ఈ తరుణంలో.. ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు ప్రతీ రోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతిచ్చినట్టు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం కాబూల్‌లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల…