అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం…ఆదేశ అధ్యక్షులు జోబైడెన్‌తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం…
దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాన సూచీల్లో ఒకటైన సెన్సెక్స్ 60 వేల పాయింట్లను దాటి కొత్త చరిత్రను లిఖించింది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఓ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇప్పటికే ప్రపంచంలో ఆరో అతిపెద్ద మార్కెట్లుగా నిలిచిన భారత స్టాక్ మార్కెట్లు.. త్వరలోనే ఐదో స్థానానికీ ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. రోజంతా అదే జోరును కొనసాగింది. స్వల్పసమయం…
స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్‌తో భారత రక్షణశాఖ భారీ ఒప్పందం కుదుర్చుకున్నది. 56 సీ మీడియం 295 విమానాల కోనుగోలు చేసేందుకు రూ.20 వేల కోట్ల రూపాలయలతో ఒప్పందం కుదుర్చుకున్నది. సీ 295 మీడియం డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ విమానాలను కోనుగోలు చేయాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉన్నది. కాగా రెండు వారాల క్రితమే ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. మొదట 16 సీ 295 విమానాలను 48 నెలల్లోగా భారత్‌కు అందించేలా…
భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటింది. అలాగే నిఫ్టీ 18 వేల పాయింట్లకు చేరువవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ సెన్సెక్స్ 60 మార్కు దాటింది. మరోవైపు నిఫ్టీ సైతం 18000 కీలక మైలురాయి దిశగా పరుగులు తీస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలూ మార్కెట్…
బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం మోదీ ఇమేజ్ వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గుజరాత్ కు వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీకి గుజరాత్ ను కంచుకోటగా మార్చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న గుజరాత్ పై తన మార్క్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇక త్వరలోనే గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.…
ఖైదీలకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. బెయిల్ మంజూరీ అయిన వెంటనే విడుదలయ్యేలా ఫాస్టర్ విధానం అమలుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఖైదీల విడుదల చేసేలా సిజె ఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టులు బెయిల్ మంజూరీ చేసినా సాంకేతిక కారణాలతో ఖైదీల విడుదలలో జరుగుతున్న జాప్యంపై సుమోటో గా కేసు విచారణను చేపట్టిన సుప్రీం ధర్మాసనం… ఖైదీల విడుదలలో జాప్యాన్ని నివారించేందుకు ఫాస్టర్ విధానం అమలుకు…
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 318 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 32,542 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,00,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. 187 రోజుల్లో ఇదే అతి తక్కువ.. మరోవైపు..…
వంటగ్యాస్ ధరలు ప్రతినెలా తడిసిమోపెడు అవుతున్నది. అంతర్జాతీయంగా ఇంధనం ధరలు పెరుగుతుండటంతో గ్యాస్ ధరలను పెంచుతూ వస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు గ్యాస్ కు భారీ సబ్సిడీని ఇవ్వడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, పేదలతో పాటుగా ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలు కూడా గ్యాస్ సబ్సిడీని వినియోగించుకోవడంతో కేంద్రం సబ్సిడీని ఇవ్వడం నిలిపివేసింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం గ్యాస్ ధర రూ.900 పలుకుతున్నది. కాగా, ఇప్పుడు మరోసారి కేంద్రం గ్యాస్ కు సబ్సిడీ ఇవ్వాలని…
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ… బిజీ బిజీగా గడుపుతున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్‌తో సమావేశమయ్యారు. కరోనా పరిణామాలు సహా కీలక అంశాలపై ఆమెతో చర్చించారు. అనంతరం కమలా హ్యారీస్‌తో కలిసి జాయింట్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మారణహోమం సృష్టించిన సమయంలో…. అండగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. అమెరికా, భారత్ మధ్య సహకారం, సమన్వయం మరింత బలపడ్డాయన్నారు పీఎం.…
ఇప్పటి వరకు మనదేశం రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై అధారపడుతూ వచ్చింది. అయితే, ఆత్మనిర్భర్ భారత్ పేరుతో స్వదేశీ వస్తువులను కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా రక్షణ వ్యవస్థకు సంబందించి అనేక ఆయుధాలను ప్రస్తుతం సొంతంగా ఇండియాలోనే తయారు చేసుకుంటున్నారు. మెషిన్ గన్, తేలికపాటి యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలను, క్షిపణులను ఇండియాలోనే తయారు చేసుకుంటున్నారు. అంతేకాదు, యుద్ధ షిప్పులు, జలాంతర్గాములు వంటివి కూడా ఇండియాలోనే తయారవుతున్నాయి. కాగా, ఇప్పుడు ఇండియా సొంత టెక్నాలజీతో…