బ్రిటీషర్లు భారత దేశాన్ని పరిపాలించే రోజుల్లో అనేక రకాలైన పన్నులు విధించేవారు. ఆ పన్నులు మరీ దారుణంగా, సామాన్యులు భరించలేనంతగా ఉండేవి. సామాన్యులతో పాటుగా వ్యాపారులు సైతం ఆ పన్నులకు భయపడిపోయేవారు. కాని, తప్పనిసరి పరిస్థితుల్లో పన్నులకు ఒప్పుకోవాల్సి వచ్చేది. తొలి స్వాతంత్య్ర సగ్రామం సమయంలో మన దేశంలో గుజరాత్ ప్రాంతంలోని కచ్‌లోనూ, ఒడిశా ప్రాంతంలోనూ అధికంగా ఉప్పు ఉత్పత్తి అయ్యేది. అయితే, ఈ ఉప్పుపై పెద్ద ఎత్తున బ్రిటీషర్లు పన్నును వేసేవారు.
ఈ పన్నులకు ఒప్పుకున్న వారికే ఉప్పు క్షేత్రాలను లీజుకు ఇచ్చేవారు. పన్నులకు దెబ్బలకు తట్టుకోలేని చాలామంది ఉప్పును వివిధ మార్గాల్లో బ్రిటీషర్లకు తెలియకుండా చేరవేసి అమ్ముకునేవారు. ఇది గమనించిన బ్రిటీష్ పాలకులు ఈ అక్రమ అమ్మకాలను చెక్ పెట్టేందుకు కంచెను నిర్మించాలని అనుకున్నారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతం నుంచి ఒడిశాలోని మహానది వరకు మొత్తం 4 వేల కిలోమీటర్ల దూరం కంచెను నిర్మించేందుకు ప్లాన్ చేశారు.
Read: ఇదేం ఫ్యాషన్‌రా బాబు… ఆమెను చూసి పరుగులు తీస్తున్నారు…
దీనికోసం తుమ్మ చెట్లు, ముళ్ల చెట్లను నాటారు. 1869లో ఈ కంచె నిర్మాణం ప్రారంభం అయింది. 1872లో ఈ కంచె నిర్మాణం కోసం 14000 మంది సిబ్బందిని వినియోగించారు. ఈ కంచెను అంతర్గత కస్టమ్స్ రేఖగా పిలిచేవారు. ప్రతి నాలుగు మైళ్లకు ఒక చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఒంటెల ద్వారా, ఎద్దుల బండ్ల ద్వారా కంచెను దాటుకొని ఉప్పును తరలించేవారు. ఈ కంచె నిర్మాణం, మెయింటెన్స్ పెను భారంగా మారడంతో బ్రిటీష్ వారు 1879 నుంచి ఆ కంచెను పట్టించుకోవడం మానేశారు.