ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి బులిటెన్ ప్రకారం 20 వేలకు దిగువున కేసులు నమోదవ్వగా ఈరోజు బులిటెన్ ప్రకారం కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా, దేశంలో 22,431 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. ఇందులో 3,32,00,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,44,198 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 318 మంది మృతి చెందారు.…
భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా, 18 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ అందించేందుకు భారత్ బయోటెక్ సిద్ధం అవుతున్నది. ఇప్పటికే చిన్నారుల కోసం తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ సంస్థ పూర్తిచేసింది. ఈ ట్రయల్స్ కు సంబంధించిన డేటాను భారత ఔషద…
మన దేశంలోనే కాదు ..అమెరికాలో కూడా ధరలు మండిపోతున్నాయి. సరుకులను ముట్టుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటెమ్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో వినియోగదారులు మాంసం తినాలంటే భయపడుతున్నారు. దాంతో మటన్ షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. ఇదంతా కరోనా ఎఫెక్టే!! హోల్ సేల్ మార్కెట్లో మేక మాంసం పౌండ్ పది డాలర్లు. పౌండ్ అంటే 453 గ్రాములు. అంటే అర్థకిలో మటన్ 740 రూపాయలు. కిలో అయితే దాదాపు పదిహేను వందలు. గతంలో…
దేశ ప్రజలను కరోనా భయాలు ఇంకా వీడలేదు. కేసులు తగ్గుతున్నాయి. కానీ ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు. థర్డ్ వేవ్ సమయం సమీపిస్తుండటమే ఆ భయాలకు, అందోళనకు కారనం. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన తరుణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం అక్టోబర్-డిసెంబర్ మధ్యలో మూడో ముప్పు ఉంటుంది. అయితే ఈ రకం కరోనా వైరస్ తొలి రెండింటి కన్నా తక్కువ ప్రమాదకరమని అంటున్నారు. ఇది కాస్త ఊరట కలిగించే విషయం. థర్డ్ వేవ్ వచ్చే…
మొన్నటి రోజున ఫేస్బుక్లో అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటలపాటు ఫేస్‌బుక్‌కు అంతరాయం కలిగింది. ఏడు గంటల అంతరాయంతో 7 బిలియిన్ డాలర్ల మేర నష్టం వచ్చింది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో గత కొన్ని గంటలుగా జియో నెట్ వర్క్‌లో సమస్యలు వస్తున్నాయి. జియోనెట్ లో సమస్యలు వస్తున్నాయని వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. జియోనెట్డౌన్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఈ నెట్ వర్క్ సమస్యలు తాత్కాలికమే అని, సమస్యలు…
బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు పడిపోయాయి. గత నెల చివరినాటికి సగటున నాలుగు రోజులకు సరిపడా నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి దేశంలో ని సగానికి పైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. బొగ్గు కొరతను ఎదుర్కుంటున్నాయి దేశంలోని సుమారు 135 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. ఆగస్టు ప్రారంభంలో 13 రోజులకు సరిపడా నిల్వలను కలిగి ఉన్నాయి విద్యుత్ కేంద్రాలు. దేశంలో సగానికి పైగా బొగ్గుఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సరఫరా అంతరాయం ఏర్పడనుంది. బొగ్గు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,833 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 278 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,31,75,656 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,49,538 మంది మృతి చెందారు. దేశంలో 2,46,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి…
దేశంలో మళ్లీ ఉల్లి ధరలు పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మనదేశంలో అత్యధికంగా ఉల్లి పంట మహారాష్ట్రలో పండుతుంది. అయితే, తుఫాన్, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ఉల్లిపంట దెబ్బతిన్నది. దీంతో డిమాండ్‌కు తగినంత ఉల్లిపంట లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఉల్లి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎంతమేర ఉల్లి ధరలు పెరుగుతాయి, ఎన్ని రోజులకు తిరిగి కొత్త పంట అందుబాటులోకి వస్తుంది అన్నది…
కరోనా తగ్గిందని ప్రశాంతంగా ఉందాం అనుకునేలోపే పోస్ట్ కరోనా సమస్యలు మొదలయ్యాయి. శరీరంలోని అన్ని అవయవాలపైనా కరోనా తన ప్రభావం చూపిస్తుంది. తాజాగా నిమ్స్ వైద్యుల పరిశోధనలో జీర్ణ కోశ వ్యవస్థపై కరోనా ప్రభావం ఉందని తేలింది. చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారుతోందని నిమ్స్ వైద్య బృందం అంటోంది. దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. ఐతే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అంతా బాగానే ఉందని అనుకుంటే పొరపాటే. కరోనా…