టీం ఇండియాకు ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్‌లు గెలిచేంత మానసిక బలం లేదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు తాను ఆడిన మొదటి మ్యాచ్ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఓడిపోయింది. దాంతో వారు నిన్న ఆడిన రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన తప్పకుండ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ మ్యాచ్ లో మొదటి మ్యాచ్ కంటే ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఈ ఓటమి పై గంభీర్ స్పందిస్తూ… విరాట్ కోహ్లి నేతృత్వంలోని ప్రస్తుత భారత జట్టుకు ముఖ్యమైన గేమ్‌లను గెలవగల మానసిక బలం లేదు. అందుకే గత రెండేళ్లుగా ప్రధాన టోర్నమెంట్ లలో నాకౌట్ గేమ్‌లను కోల్పోయింది. అయితే ఈ జట్టులోని ఆటగాళ్లలో చాలా నైపుణ్యం ఉంది. కానీ దురదృష్టవశాత్తు కీలక మ్యాచ్ లలో ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతారు అని తెలిపాడు.