ప్రపంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. గుజరాత్ కేంద్రంగా జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇప్పటికే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడంతో జైడస్ క్యాడిలా జైకొవ్ డి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఈనెల 20 వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. మూడు డోసుల వ్యాక్సిన్ కావడం విశేషం. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సిరంజితో…
తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు,బోర్డర్ లో ఉన్నసమస్యలు తగ్గించేందుకు ఇండియా చైనా దేశాల మధ్య కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజున 13 వ కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. భారత్ చేసిన సూచనలను చైనా అంగీకరించలేదని, ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ చర్చలు ముగిసిన తరువాత చైనా మరోసారి భారత్ అనుసరిస్తున్న విధానలను, వ్యూహాలపై డ్రాగన్…
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్సే. ఈ రికార్డును దేశంలోని ఏ రాజకీయ పార్టీ బ్రేక్ చేసే అవకాశం కనుచూపు మేరల్లో కన్పించడం లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ గడిచిన దశాబ్దకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేంద్రంలో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అధికారానికి దూరమవడంతో ఆ ప్రభావం క్రమంగా రాష్ట్రాలపై పడుతోంది. దీంతో క్రమంగా ఆయా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ క్రమంగా పట్టును కోల్పోవాల్సి వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే…
దేశంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ సమస్యలపై వార్తలు వస్తున్నాయి. బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, ఈ కోరత ఇంకోన్నాళ్లు ఇలానే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తప్పదని రాష్ట్రాలు పేర్కొన్నాయి. దీనిపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, బొగ్గుశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దేశంలో బొగ్గు కొరత లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను…
దేశంలో కరోనా కేసులు నేడు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 18,132 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607 కి చేరగా ఇందులో 3,32,93,478 మంది ఇప్పటికే కోలుకున్నారు. 2,27,347 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 193 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,50,782 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో…
కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇక మహమ్మారి పని అయిపోయిందని భావించి అంతా కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు.. నో మాస్క్, నో సోషల్ డిస్టెన్స్ అనే తరహాలో ప్రవర్తించారు ప్రజలు.. దీంతో.. సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టించింది.. మళ్లీ కేసులు తగ్గుముఖం పడుతునున్నాయి.. పండుగల సీజన్ ప్రారంభమైంది.. మళ్లీ గుంపులుగా చేరుతున్నారు.. అంతా కలుసుకుంటున్నారు. ఇదే సమయంలో.. కోవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారని ఓ సర్వే చెబుతోంది.. కేంద్ర ప్రభుత్వం సైతం కొవిడ్…
ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఓ స్టార్ బయటకు వచ్చాడు. అతనే ఉమ్రాన్ మాలిక్. ఈ ఏడాది ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరపున చివరి మూడు మ్యాచ్ లలో ఆడిన మాలిక్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బంతి వేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ ఐపీఎల్ 2021 లో హైదరాబాద్ ప్రయాణం…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 18,166 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో 2,30,971 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 214 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,50,589 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో…
కరోనా కష్టకాలంలో కూడా ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతూ పోయింది. పద్నాలుగేళ్లుగా దేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారాయన. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గల అత్యంత సంపన్నుల జాబితాలో కూడా చోటు సంపాదించారు ముఖేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఉన్న ముఖే అంబానీ ఆస్తుల విలువ ఈ ఏడాది దాదాపు 24 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం ఆస్తుల విలువ నూటొక్క బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో బ్లూమ్‌బర్గ్ వంద బిలియన్…
దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేయాలని, యువతకు బాధ్యతలు అప్పగించాలని, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని సీనియర్ నేతలు పలుమార్లు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలోపేతం కావాలి అంటే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేపట్టాలి. అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయి. అదే విధంగా, రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కూడా విభేదాలు…