హుజురాబాద్, బద్వేల్‌తో పాటు ఇవాళ దేశ వ్యాప్తంగా పలు స్థానాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి ఫలితాలు రానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గత నెల 30న దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అసోంలో 5, బెంగాల్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, బీహార్‌లో2, కర్ణాటకలో2, రాజస్థాన్‌లో 2, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలోని ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు జనం తీర్పుపై ఉత్కఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.