యాపిల్, గూగుల్, శాంసంగ్ తో పాటు అనేక కంపెనీలు మోబైల్ ఫోన్లతో పాటుగా స్మార్ట్ వాచ్‌లను కూడా విపణిలోకి ప్రవేశపెట్టాయి. స్మార్ట్ వాచ్‌లను స్మార్ట్ ఫోన్‌లతో అనుసంధానం చేసుకొని వినియోగించుకోవచ్చు. ఫోన్ లలో ఉన్నట్టుగానే స్మార్ట్ వాచ్‌లలో కూడా బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీని రీచార్జ్ చేసుకోవాలి. ఇదిలా ఉంటే, హువావే కంపెనీ భారత్ మార్కెట్‌లోకి కొత్త వాచ్ పిట్ పేరుతో స్మార్ట్ వాచ్‌ని విడుదల చేసింది. ఈ వాచ్ పిట్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
Read: ముంబై- కర్ణాటక పేరు మార్పు…
1.64 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 130 కి పైగా వాచ్ ఫేస్‌లు, అత్యాధునిక డేటా ట్రాకింగ్ ఫీచర్, ఫిట్‌నెస్, డ్యాన్సింగ్, బాల్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్, వింటర్ స్పోర్ట్స్‌కు సంబంధించి 85 రకాల వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి. ఫిట్‌నెస్ కోసం 12 యానిమేటెట్ కోర్సులతో పాటుగా 44 రకాల ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లు ఈ వాచ్‌లో ఉన్నాయి. హార్ట్‌రేట్‌ను, బ్లడ్‌లో ఆక్సీజన్ లెవెల్స్‌ను తెలుసుకునే సౌకర్యం ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నది.
Read: ఆ కేసులో మాజీ మంత్రి అరెస్ట్…
ఇక ఈ వాచ్‌కు సంబంధించిన బ్యాటరీని ఒకసారి రీఛార్జ్ చేస్తే 10 రోజులపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. అరగంట వ్యవధిలోనే 70 శాతం బ్యాటరీ రీఛార్జ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వాచ్ ప్రారంభ ధర రూ.8,990 గా నిర్ణయించారు. ఈరోజు నుంచి ఈ స్మార్ట్ వాచ్ పిట్‌లు విపణిలో అందుబాటులో ఉండబోతున్నాయి.