దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తప్పనిసరిగా తీసుకుంటున్నారు. రేపటితో భారత్‌లో కరోనా టీకాల డోసులు 100 కోట్లకు చేరుకోనున్నాయి. 130 కోట్ల భారతావనిలో ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా తొలి డోస్, 29 కోట్ల మంది ప్రజలు సెకండ్ డోస్‌లను వేయించుకున్నారు. భారత్‌లో జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన…
దేశ వ్యాప్తంగా టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో టమోటా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమోటా పంటలు ఎక్కువగా పండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రైతులు తమ నష్టాన్ని ధరలు పెంచి భర్తీ చేసుకుంటున్నారు. అకాల వర్షాల వల్ల టమోటాల సరఫరా తక్కువ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యమైన వెజిటబుల్…
కాలాన్ని సూచించడానికి మన పూర్వీకుల దగ్గరి నుంచి నేటి జనరేషన్ వరకు కూడా క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని మాట్లాడేవాళ్లు. అయితే ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆ పిలుపుకు బ్రేక్ పడినట్లే కన్పిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ఎప్పుడైతే ఆ దేశాన్ని వీడి ప్రపంచానికి పాకిందో అప్పటి నుంచి కరోనా పేరు మార్మోమోగిపోయింది. ఇది సృష్టించిన బీభత్సం తలుచుకుంటేనే వెన్నులో వణుకుపట్టడం ఖాయం. కోవిడ్-19 ఎఫెక్ట్ తో ఇప్పుడంతా కరోనాకు…
రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో… రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. అక్టోబరు 18 నుంచి 20 మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40…
ఇండియా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గు ముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,058 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 164 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19,470 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,94,373 కు పైగా పెరగగా.. రికవరీ కేసులు 3,40,94,373 కు పెరిగాయి. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా…
ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఇంగ్లండ్‌పై ఏడు వికెట్లతేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈపోరులో భారత్ పై చేయి సాధించింది.ప్రధానంగా భారత బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడడంతో ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే విజయభేరీ మోగించింది భారత్.టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయభేరి మోగించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన…
కరోనా కాలంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. గత నాలుగైదు నెలలుగా ఉల్లి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఉల్లి పంటలు పాడైపోయాయి. దీంతో దేశంలో మళ్లీ ఉల్లి ఘాటు పెరిగేలా కనిపిస్తోంది. ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో రూ.20-30 పలికిన ధరలు ఇప్పుడు రూ.40-50 పలుకుతున్నది. ఈ ధరలు మరింతగాపెరిగే అవకాశం ఉన్నది. నిల్వ ఉంచిన పంటను రైతులు విదేశాలకు…
బోర్డర్లో నిత్యం పహారా కాసే సైనికులు కబడ్డీ అడుతూ కనిపించారు. భారత్, అమెరికా దేశాల సైనికులు యుద్ద్ అభ్యాస్ పేరుతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని అలస్కాలో ఈ యుద్ద్ అభ్యాస్ విన్యాసాలు జరుగుతున్నాయి. అక్టోబర్15 నుంచి 29 వరకు ఈ విన్యాసాలు జురుగుతాయి. ఇండియా నుంచి 350 మంది, అమెరికా నుంచి 300 సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, వీరి మధ్య మంచి వాతావరణం నెలకొల్పేందుకు వివిధ రకాల క్రీఢలను…
ఇండియాలో మరోసారి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 13, 596 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 166 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19, 582 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.40 కోట్లకు పైగా పెరగగా..…
చైనా మరోసారి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఓ సరికోత్త హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి భూకక్ష్యకు దిగువున భూమి మొత్తాన్ని చుట్టేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అయితే, చైనా ప్రయోగించిన ఈ క్షిపణి కొద్దిలో గురితప్పినప్పటికీ, అమెరికా కన్నుగప్పి ఈ క్షిపణిని ప్రయోగించింది. భూకక్ష్యకు దిగువున భూమి మొత్తం చుట్టేసి రావడం అంటే మాములు విషయం కాదు. ఈ హైపర్ సోనిక్ క్షిపణి అమెరికా మీద నుంచి కూడా ప్రయాణం చేసి ఉండవచ్చు.…