అంతర్జాతీయ శాంతి భద్రతలు, మినహాయింపులు, నిర్వహణ, అసమానతలు, సంఘర్షణలు తదితర అంశాలపై ఐరాసలో చర్చ జరిగింది. ఈ చర్చలో భారత్ తరపున కేంద్ర విదేశాంగ సహాయమంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భందా ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ దేశాలకు ఎల్లప్పుడు భారత్ అండగా ఉంటుందని, ఆయా దేశాల ప్రాధాన్యతలను గౌరవిస్తూ సహకరిస్తామని అన్నారు.
Read: గ్లోబల్ వార్మింగ్: ఆ దేశం కనుమరుగౌతుందా?
ఇతర దేశాలకు సాయం పేరుతో రుణభారాన్ని మోపబోమని డాక్టర్ రంజన్ సింగ్ పేర్కొన్నారు. మానవతా దృక్పధంతోనే పేద దేశాలకు సహాయం చేస్తున్నామని, ఎప్పుడూ ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చి రుణభారాన్ని మోపబోమని తెలిపారు. పొరుగున ఉన్న దేశాలకైనా, ఆఫ్రికన్ దేశాలకైనా అక్కడి డిమాండ్ మేరకే సహాయం అందిస్తామని, బెల్ట్ అండ్ రోడ్ పేరుతో పెట్టుబడులు పెట్టి ఆయా దేశాలపై రుణభారాన్ని పెంచే దేశాల మాదిరిగా తాము చేయబోమని భారత్ పేర్కొన్నది.