ధనాధన్ క్రికెట్లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేటి నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడతాయి. ఈ కప్ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వేదికను ఎడారి దేశానికి తరలించారు.ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్ ఆరంభమైంది. ప్రధాన మ్యాచ్‌లు మాత్రం సూపర్-12 పేరిట…
1498లో వాస్కోడిగామా యూరప్ నుంచి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తరువాత భారత దేశంతో యూరప్ దేశాల నుంచి వాణిజ్యం మొదలైంది. ఇలా 1600 సంవత్సరంలో భారత్‌లో ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. ఇంగ్లాండ్ కు చెందిన సర్ థామస్ మూడేళ్లు కష్టపడి ఇండియాలో ఈస్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకున్నాడు. ఇలా ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటీషర్లు వేగంగా ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారం మొదలుపెట్టారు. క్రమంగా దేశంలో బలాన్ని పెంచుకున్నారు. 50 ఏండ్ల కాలంలో…
ఇప్పుడు ఎక్కడ చూసినా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి కనిపిస్తోంది. ఈ బండిపై వస్తున్న పాటలు ఫేమస్ అవుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి వచ్చిన ఈ బుల్లెట్ బండ్లు మొదట తయారైంది ఇంగ్లాండ్ దేశంలో. ఇంగ్లాండ్ లోని రెడిచ్ పట్టణంలోని హంట్ ఎండ్ అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో సూదులు, సైకిల్ సీట్లు, పెడళ్లు వంటి వాటిని తయారు చేసే జార్జి టౌన్సెండ్ అండ్ కో అనే కంపెనీ ఉండేది. 1891 వరకు…
దేశంలో కరెన్సీ నోట్లపై జాతిపిత గాంధీజీ బొమ్మ కనిపిస్తుంది. బోసి నవ్వులు నవ్వుతూ ఉండే ఆ బొమ్మ లేకుంటే ఆ నోటు చెల్లదు. దేశంలో స్వాతంత్య్రం రాకముందు నుంచే కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్య్రం రాక ముందు ఉన్న కరెన్సీ నోట్లపై కింగ్ జార్జ్ బొమ్మ ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949తో ఇండియా రూపాయి నోటును అందుబాటులోకి తీసుకొచ్చింది. రూపాయినోటుపై కింగ్ జార్జ్ బొమ్మకు బదులుగా మహాత్మా గాంధీ బొమ్మను ఉంచాలని ఆర్బీఐ…
ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు..భారత్ వంద కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. అందరి సహాయ సహకారాలతో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయిందన్నారు. కరోనా పై యుద్ధంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ కనుగొంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన దేశాలే నేడు భారత్ వైపు చూస్తున్నాయి అన్నారు. ఇదంతా భారత ఐక్యమత్య శక్తికి నిదర్శనమన్నారు. వ్యాక్సినేషన్లో భారత్ స్పీడు చూసి ప్రపంచ…
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 18 వేలు క్రాస్ చేసిన కరోనా మహమ్మారి కేసులు.. ఇవాళ ఏకంగా 15 వేలకు తగ్గుమఖం పట్టాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 15,786 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 231 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,75,745 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో…
బ్రిటన్ ఆటోమోబైల్ దిగ్గజం ఎంజీ కంపెనీ ఆస్టర్ మోడల్‌ను అక్టోబర్ 11 వ తేదీన ఇండియాలో రిలీజ్ చేసింది. అక్టోబర్ 21 వ తేదీన ఎంజీ అస్టర్ మిడిల్ సైజ్ ఎస్‌యూవీకి సంబంధించి ప్రీబుకింగ్‌ను ప్రారంభించింది. ప్రీ బుకింగ్‌ను ప్రారంభించిన 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేల కార్ల బుకింగ్ జరిగినట్టు ఎంజీ ఇండియా ప్రకటించింది. ఇప్పుడు బుక్ చేసుకున్న 5 వేల కార్లను వచ్చే ఏడాదివినియోగదారులకు అందజేస్తారు. కొత్త కార్ల బుకింగ్ కోసం వచ్చే ఏడాది…
దక్షిణ చైనా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదగాలని చైనా చూస్తున్నది. దీనికోసం చుట్టుపక్కల దేశాలను బెదిరిస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే హాంకాంగ్, టిబెట్‌పై ఆధిపత్యం చలాయిస్తున్న చైనా, తైవాన్ను ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే అమెరికా అధికారులు తెలిపారు. హిమాలయ సరిహద్దుల్లో చైనా దురాక్రమణలకు పాల్పడుతూనే ఉందని చైనాలో కొత్తగా నియమితులైన సీనియర్ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని వియాత్నం, ఫిలిప్పిన్స్‌తో పాటుగా జపాన్,…
ఏ జట్ల మధ్య మ్యాచ్ కోసం… యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తుందో… ఆ క్షణం వచ్చేసింది. దాయాదుల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ఆ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే ఆసక్తి చూపుతారు. కానీ… ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంటే… క్రికెట్ రుచి తెలియని దేశాలు సైతం టీవీలకు అతుక్కుపోయి చూస్తాయి. మిగతా దేశాలతో మ్యాచ్ ఆడితే గెలుపోటములను సమానంగా స్వీకరిస్తారు. కానీ.. దాయాది…
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతున్న వేళ.. డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దీంతో భారత్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అభినందించారు. 100 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను టెడ్రోస్ అథనోమ్ రీట్వీట్ చేశారు. కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న వేళ ప్రజలను…