అది 15 అడుగుల ఎత్తు పెరిగిన చెట్టు. ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ పటిష్టమైన భధ్రత ఉంటుంది. 24 గంటలూ చెట్టు దగ్గర ముగ్గురి నుంచి ఐదుగురు పహారా కాస్తుంటారు. ఎవర్నీ ఆ చెట్టు దగ్గరకు అనుమతించరు. అంతేకాదు, వీఐపీలు, వీవీఐపీలు కంచెదాటి చెట్టు వద్దకు వెళ్లాలన్నా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందే. ఇంత భద్రత మధ్య ఉన్న ఆ చెట్టు పేరు ఏంటి? ఎందుకు అంతటి భద్రతను కల్పిస్తున్నారు. తెలసుకుందాం. అది బొధి చెట్టు.…
మన దేశంలో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 14,306 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 443 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,67,695 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్…
1859లో ఇండియాలో తొలిసారి రైళ్లను ప్రవేశపెట్టారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951లో భారతీయ రైల్వేలను జాతీయం చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం ఇండియా. ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి రైళ్లను వినియోగిస్తుంటారు. అయితే, రైలు పెట్టెల పైభాగంలో ఒక మూల వైపు పసుపు, తెలుపు, గ్రీన్ వంటి గీతలు ఉంటాయి. అవి ఎందుకు వేస్తారో, వాటి అర్థం…
ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. రోమ్‌లో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు.ఈ నెల 29 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోడీ. ఇటలీ, బ్రిటన్‌లో పర్యటించనున్న ప్రధాని.. 6వ జీ-20, కాప్-26, వరల్డ్ లీడర్స్శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకానున్నారు. మొత్తం 5 రోజులపాటు విదేశాల్లో ఉండనున్న మోడీ.. మొదట రోమ్కు వెళతారు. ఈనెల 30, 31వ తేదీల్లో ఇటలీ ప్రధాని…
మనదేశం నుంచి విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ అవసరం ఎంతో ఉంటుంది. అయితే, ఇతర దేశాల్లో పర్యటించాలి అంటే తప్పనిసరిగా వీసా కావాలి. కానీ, కొన్ని దేశాల పాస్ పోర్ట్‌లు ఉంటే చాలు వివిధ దేశాల్లో ఎంచక్కా పర్యటించి రావొచ్చు. వీసాతో అవసరం లేదు. సింగపూర్, జపాన్ దేశాలకు సంబంధించిన పాస్‌పోర్టులు ఉంటే చాలు. వీసాలతో అవసరం లేకుండా 192 దేశాలకు వెళ్లిరావొచ్చు. ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్‌పోర్టులు ఇచ్చే దేశాల ఆధారంగా ఈ వెసులుబాటు…
ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత ఆటగాళ్లను మీమ్స్‌తో తెగట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా.. మూడో ఓవర్లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాకిస్థాన్ యువ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ పేస్‌కు ఈ ఇద్దరు విలవిలలాడారు. ఒత్తిడికి చిత్తయిన ఈ జోడీ ఆరంభంలోనే వికెట్లను పారేసుకొని వెనుదిరిగారు. దాంతో…
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు ఒత్తిడికి చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇషాన్ కిషన్ పేరు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో కనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇషాన్ కిషన్ తన విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత…
అంతర్జాతీయ వేదికల్లో ఆధిపత్యం చెలాయించిన పాక్…ప్రపంచకప్‌లో మాత్రం భారత్ చేతిలో భంగపాటు తప్పడం లేదా ? టీ20 వరల్డ్ కప్‌లో…ఐదు మ్యాచ్‌లు జరిగితే…భారత్ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. రెండు జట్ల బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలక ఆటగాళ్లు ఎవరు ? అన్ని విభాగాల్లోనూ కోహ్లీ సేన పటిష్టంగా ఉందా ? కొన్నేళ్ల క్రితం వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. అయితే ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తుండడంతో… ఆ ప్రభావం ఇరు దేశాల క్రీడలపైనా పడింది.…
దాయాదుల సమరానికి సమయం దగ్గర పడుతోంది ? ప్రపంచ కప్ వేదికల్లో తిరుగులేని భారత్…మరోసారి పాకిస్తాన్‌తో తలపడేందుకు రెడీ అయింది. ధనాధన్ మ్యాచ్‌ల్లో ఎదురులేని భారత్…మరోసారి ప్రత్యర్థిని ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే బాబర్ జట్టును ఓడించి…శుభారంభం చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన. ధనాధన్ పోరులో….ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో…అలాంటి పరిస్థితులే మ్యాచ్‌లోనూ ఉండనున్నాయ్.…
పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకు కూడా పండుగే. ఎలా అంటారా? ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారు. మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ప్రాడక్ట్ చేరువవుతుంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజా రాజా…బాబర్ సేనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే…హడావిడి అంతా ఇంతా ఉండదు. రెండు దేశాల అభిమానులతో పాటు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్…