సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్ లో కరోనా తొలికేసు నమోదైంది. రెండేళ్ల కాలంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా తొలికేసు నమోదైనపుడు దేశంలో తెలియని భయం నెలకొన్నది. కరోనా కేసులు నమోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు సరైన కిట్లు, వ్యాక్సిన్లు అప్పట్లో అందుబాటులో లేవు. దీంతో కరోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్నది సందిగ్ధంగా మారింది. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల 94 వేల…
రైల్వేశాఖలో ఉపయోగంలో లేని పాత బోగీల సంఖ్య పేరుకుపోతున్నాయి. పాత రైల్వే బోగీలను వినియోగించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపయోగం లేని బోగీలను రెస్టారెంట్లుగా మార్చాలని రైల్వేశాఖ నిర్ణయం దీసుకుంది. పాత బోగీలకు రంగులు వేసి రెస్టారెంట్లుగా మార్చే ప్రక్రయను చేపట్టింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో పాత రైల్వే బోగీలను మొదటగా రెస్టారెంట్‌గా మార్చింది. ఈ బోగీ రెస్టారెంట్ ఆకట్టుకోవడంతో రైల్వేశాఖ మరికొన్ని రైల్వే బోగీలను రెస్టారెంట్లుగా మార్చాలను నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బోగీకి సంబంధించిన…
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. టూ వీలర్స్‌తో పాటు కార్లను కూడా ఇండియాలో తయారు చేస్తున్నారు. ఇప్పటికే టాటా మొదలు అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో కీలకమైనది బ్యాటరీ ఛార్జింగ్. ఛార్జింగ్‌కు ఎక్కువసమయం తీసుకుంటుంది. పెట్రోల్ బంకుల మాదిరిగానే దేశంలో ఎలక్ట్రిక్ రీఛార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మీడియం ఛార్జింగ్ నుంచి హైస్పీడ్ ఛార్జింగ్ ల వరకు ఏర్పాటు చేస్తున్నారు. గురుగ్రామ్ వద్ద నేషనల్ హైవే ఫర్…
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో రికార్డు సృష్టించింది. గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా… ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశంలో 75 శాతానికి పైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై…
రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్‌కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్‌లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట…
భారతదేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. పౌరులకు అభినందనలు తెలియజేశారు.. దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు సహకరించిన మా తోటి పౌరులకు అభినందనలు.. మా టీకా డ్రైవ్‌ను విజయవంతం చేస్తున్న అందరికీ ఇది గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.. దేశంలోని వయోజన జనాభాలో 75 శాతానికి పైగా ఇప్పుడు…
క్షిపణి వ్యవస్థతో పాటు ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించిన రెండు వందలక కోట్ల డాలర్ల డిఫెన్స్ ప్యాకేజీలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచలానత్మక కథనం ప్రచురించింది. ‘ ద బాటిల్ ఫర్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్ వెపన్’ పేరుతో ఈ కథనం వెలువడింది. దాంతో భారత్‌లో మరోసారి పెగాసిస్ అంశం ప్రధాన వార్తగా మారింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాలు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది కెనడా సర్కార్.. భారత్ నుంచి నేరుగానైనా లేదా గల్ఫ్/యూరప్/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా.. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత కట్టడి చర్యల్లో భాగంగా చాలా దేశాలు ఆంక్షల బాటపట్టాయి.. ముఖ్యంగా విదేశీ ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించాయి.. ఇదే సమయంలో.. కెనడా కూడా ఆంక్షలు విధించి.. ఆ…