భారత్‌లో కరోనా ఉధృతి తగ్గింది.. క్రమంగా రోజువారీ కేసుల సంఖ్య దిగివస్తోంది.. తాజాగా ఆ సంఖ్య 14 వేల కిందకు పడిపోయింది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 13,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 235 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 34,226 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. పాజిటివిటీ రేటు 1.24శాతానికి పరిమితమైంది. ప్రస్తుతం యాక్టివ్…
ఎయిర్ ఇండియాను టాటా కంపెనీ సొంతం చేసుకున్న తరువాత వివిధ దేశాలకు సర్వీసులను పునుద్దరించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా సంస్థ గత 46 ఏళ్లుగా మాలేకు రెగ్యులర్‌గా విమానాలను నడుపుతున్నది. ఇండియాలోని కేరళ నుంచి ఎక్కువ విమానాలు మాలేకు నడుస్తుంటాయి. దేశంలోని మిగతా అంతర్జాతీయ విమానాశ్రాయాల నుంచి సర్వీసులు నడుస్తున్నా, కేరళ నుంచే అధికంగా సర్వీసులు నడుస్తుంటాయి. 1976 నుంచి క్రమం తప్పకుండా సర్వీసులు నడుస్తున్నాయి. నేటికి 46 ఏళ్లు పూర్తికావడంతో ఎయిర్ ఇండియా ఫ్లైట్…
ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. ఇతర పక్షాలను కూడా కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక, ఇవాళ బంగారు భారత దేశాయాన్ని తయారు చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు కేసీఆర్.. నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన ఆయన.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు…
మాతృభాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందన్నారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపైనా వెబినార్‌లో మోదీ ప్రసంగించారు. విద్యాశాఖకు సంబంధించి ఐదు అంశాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. జాతీయ…
భారత్‌లో కరోనా పాజిటివ్ గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 20 రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. తాజాగగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,051 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,38,524కి చేరింది. తాజాగా 206 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,12,109కి చేరింది. డిచిన 24 గంటల్లో దేశ…
ఉక్రెయిన్ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఓ విమానయాన సంస్థ తన సర్వీసుల్ని నిలిపేసింది. జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు తమ సర్వీసులు ఆపేశామని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని కీవ్‌తో పోర్టు సిటీ ఒడిసా కూడా నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తమ సిబ్బంది, ప్రయాణికుల రక్షణకు తాము…
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలను బట్టే పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తుంటారు. కానీ ఓ వైపు ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం లేదు. దీనికి కారణంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే. గత ఏడాది నవంబర్ 4 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాటే లేదు. ఈ కాలంలో బ్యారెల్ ముడి చమురు ధర 14 డాలర్లు…
కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరగనున్న మూడో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఇరు జట్లు తుది జట్టులో నాలుగు మార్పులు చేశాయి. విరాట్ కోహ్లీ, పంత్, భువనేశ్వర్, చాహల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. రుతురాజ్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-0…
దాదాపు 40 ఏళ్ల తరువాత ఇండియాలో మరో బిగ్ ఈవెంట్ జరగబోతున్నది. 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ముంబై వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. 1983లో ఢిల్లీ వేదికగా ఐఓసీ సమావేశాలు జరిగాయి. ఇక ప్రస్తుతం బీజింగ్ వేదికగా జరుగుతున్న 139వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో భారత బృందం ఓ ప్రజెంటేషన్ ను ఇచ్చింది. భారత బృందం ఇచ్చిన ప్రజెంటేషన్ పట్ల ఐఓసీ సంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది…
కరోనాతో గత రెండేళ్లుగా జీతాల పెంపు లేని ప్రైవేటు ఉద్యోగులకు అయాన్స్ సంస్థ సర్వే తీపికబురు చెప్పింది. 2022 ఏడాదిలో జీతాల విషయంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఇంక్రిమెంట్లు ఇస్తాయని సర్వే వెల్లడించింది. సగటున 9.9% వేతనాల పెంపు ఉంటుందని అయాన్ సంస్థ తెలిపింది. 2021లో వేతనాల పెంపు సగటు 9.3 శాతంగా ఉందని గుర్తు చేసింది దీంతో ఈ ఏడాది ఇంక్రిమెంట్లు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. మరోవైపు బ్రిక్స్ కూటమిలోని…