Omicron Xe: ఒమిక్రాన్ ఎక్స్‌ఈ వేరియంట్.. ఊరటనిచ్చే న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలా విరుచుకుపడ్డ మహమ్మారి.. మళ్లీ ఫోర్త్ వేవ్ రూపంలో మళ్లీ పంజా విసురుతుందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. భారత్‌లో దేశంలో మళ్లీ కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్స్‌ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో వెలుగు చూశాయి. మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన రేగడంతో కోవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. కొత్త వేరియంట్‌పై భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. తీవ్ర వ్యాధికి కారణమవుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని.. వేగంగా వ్యాప్తి చెందుతుందనడంపైనా సమాచారం లేదని స్పష్టం చేసింది.
Read Also: Kashmir: కశ్మీర్‌పై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని.. కౌంటర్ ఇచ్చిన మోడీ..
Also Read
ఒమిక్రాన్ నుంచి ఎన్నో కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ ఎన్‌కే అరోఢా చెప్పారు. ఎక్స్‌ఈ తోపాటు ఇతర రకాలు కేవలం ఎక్స్ సిరీస్‌లో భాగమే అన్నారు. ఇటువంటి వేరియంట్లు వస్తూనే ఉంటాయని.. వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి భారత్‌లో ఎలాంటి సమాచారం లేదన్నారు. కాగా, ఎక్స్‌ఈ వేరియంట్ తొలుత బ్రిటన్‌లో వెలుగు చూసింది. అనంతరం, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాలకూ పాకింది. తాజాగా ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో వెలుగుచూశాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే శక్తి కలిగివున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే వ్యాపించే గుణం ఎక్స్‌ఈ వేరియంట్‌కు దాదాపు 10శాతం ఎక్కువ ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కానీ భారత్‌లో ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటుంది కోవిడ్ వర్కింగ్ గ్రూప్..
తాజావార్తలు
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!