బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. 238 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిన భారత జట్టు.. టెస్ట్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు కుప్పకూలింది.. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరవగా.. జట్టును గెలిపించలేకపోయారు.. ఇక భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా 3,…
ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.. గతేడాది జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.. క్రమంగా ఏజ్ గ్రూప్‌ను తగ్గిస్తూ వస్తున్నారు.. ఇక, ఇప్పటికే 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం గ్రీన్ ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. 12 నుండి 14 సంవత్సరాల వయస్సు గల వారికి టీకా కార్యక్రమాన్ని ఎల్లుండి (మార్చి 16వ తేదీ) నుంచి…
భారత్ అమ్ములపొదిలో మరో శక్తివంతమైన క్షిపణి చేరనుంది. బ్రహ్మోస్ క్షిపణి ఇప్పటివరకు 300 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను మాత్రమే చేధించగలదు. అయితే త్వరలోనే 800 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ అభివృద్ధి చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ శక్తివంతమైన క్షిపణిని గగనతలం నుంచి ప్రయోగించే విధంగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన సంగతి…
పాకిస్తాన్భూభాగంలోకి దూసుకెళ్లిన ఇండియా మిస్సైల్‌పై ఇరు దేశాల మధ్య ఆందోళన నెలకొంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉప్పు-నిప్పుగా సాగే వ్యవహారాల్లో ఇప్పుడు ఈ మిసైల్ మిస్ ఫైర్ అంశం కొత్త వివాదం రేపుతోంది. ఇటీవల భారత సూపర్ సోనిక్ నిరాయుధ మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. మార్చి 9న సాయంత్రం 6:43 గంటలకు భారత క్షిపణి తమ భూభాగంలోని మియా చన్ను ప్రాంతంలో పడిందని పాకిస్థాన్ తెలిపింది. ప్రాణ నష్టం జరగకపోయినా ఓ గోడ కూలిపోయిందని పాకిస్థాన్ ప్రభుత్వం…
నేడు ఢిల్లీకి ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ నేడు శాసనసభలో ఏపీ వార్షిక బడ్జెట్ ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. 2022-23 బడ్జెట్ ఆమోదానికి సమావేశం. ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర. ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా ఏపీలో ఉదయం 11 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి కన్నబాబు నేడు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ సవాల్…
తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84 శాతం) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75 శాతం) కంటే ఇది దాదాపు 12 శాతం అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా మరో 10.48 శాతం పెరిగి 2.20 కోట్లకు చేరుతుందని నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అధికారులు భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా…
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది… ఇక, అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఆంక్షలు విధించారు.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన మార్గాలు, అది కూడా ప్రభుత్వ అనుమతితో.. మరీ ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇక, త్వరలోనే రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.. దీనిపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం… ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది.. కోవిడ్…
కొద్ది సమయం కాల్పుల విరమణకు రష్యా సమ్మతించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి భారతీయ, ఇతర విదేశీయుల తరలింపునకు అంగీకరించింది రష్యా. అయితే, ఉక్రేయిన్ ఒప్పుకుంటేనే అది సాధ్యమని షరతు విధించింది. ఖార్కివ్, కివ్, మరియుపోల్, సుమీ నగరాల్లో చిక్కుకుపోయున వారిని తరలించేందుకు రష్యా అంగీకారం తెలిపింది. రష్యా ప్రతిపాదనను తిరస్కరించింది ఉక్రెయిన్. రష్యా ప్రతిపాదించిన మార్గాలన్నీ నేరుగా రష్యాకు లేదా, రష్యా మిత్ర దేశం బెలారస్ కు దారితీసేయుగా…
ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు 73 విమానాల్లో 15,206 మందిని భారత్ తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అలాగే 10 ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో 2056 మందిని తరలించినట్టు తెలిపింది. సోమవారం 7 విమానాల్లో 1314 మంది భారత్ వచ్చినట్టు వివరించింది. మొత్తంగా ఫిబ్రవరి 22న ఆపరేషన్ గంగ మొదలైనప్పట్నుంచి ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 17,400 మందికి పైగా భారతీయులను సొంత దేశానికి తరలించామని వివరించింది. మంగళవారం మరో 2 విమానాలు భారత్…
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం భారత్‌లోని సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ కారణంగా ఇప్పటికే భారత్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉన్న స్టాక్‌ను వ్యాపారులు బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో వంటనూనెలకు కొరత ఏర్పడుతోంది. ఒకవేళ వంటనూనెల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని డీమార్ట్ వంటి పెద్ద షాపింగ్ మాళ్లలో లిమిటెడ్‌గా వంటనూనెల ప్యాకెట్లను…