మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు రంజుగా జరుగుతున్నాయి. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. నిజానికి మహిళల మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాబట్టి ఈ పోరు పట్ల అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. కాగా మహిళల క్రికెట్లోనూ పాకిస్థాన్‌పై భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీ చేశాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేయడంపై వివాదం చెలరేగింది. కెరీర్లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తాడని…
ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వైద్యవిద్యను అభ్యసించే భారతీయ విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. యుద్ధంతో అతలాకుతలం అవుతున్న దేశం నుంచి బయటపడాలని వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. వీరిని తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అపరేషన్ గంగా నిర్వహిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లి తిరిగొచ్చిన విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ఎంసీ నిబంధనలు సడలించింది. ఇప్పటికే కొన్ని వేలమంది మెడిసిన్ చదువుతోన్న విద్యార్థులు భారత్‌లోని…
ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగంపైనే. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతూనే వుంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు లభించాయి. చెన్నై మేయర్‌గా ఎన్నికైన దళిత మహిళ ప్రియ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నిన్న ప్రమాణ స్వీకారం చేస్తూనే రికార్డులకెక్కారు. 350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో దళిత మహిళకు తొలిసారి మేయర్ పీఠం దక్కింది. అందునా 28 ఏళ్ల అతి పిన్న ప్రాయంలోనే ప్రియ ఆ బాధ్యతలు…
ప్రపంచ దేశాలకు గతంలో ఇండియా అంటే గాంధీ గుర్తుకు వచ్చేవారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుకు వస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నరేంద్ర మోడీ లాంటి నేత మరెవరూ లేరన్న ఆయన.. ప్రపంచంలోనే అతి పెద్ద పొలిటికల్ పార్టీ బీజేపీ అన్నారు. అతి చిన్న పార్టీగా ప్రస్ధానం మొదలు పెట్టి..…
చట్టాలు చేయాల్సిన సభల్లో విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి.. అర్థవంతమైన చర్చలు జరగాల్సిన చోట.. వాదోపవాదాలు సాగుతున్నాయి.. నిరసనలు, ఆందోళనలు, ఇలా అట్టుడికిపోతున్నాయి చట్ట సభలు.. ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ప్రజా ప్రతినిధులు చట్టసభల గౌరవాన్ని కాపాడాలని సూచించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలన్నారు.. చట్టసభల్లో చోటు చేసుకుంటున్న అంతరాయాలు, ఇతర పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు వెంకయ్య. Read Also: Ukraine Russia…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరా భారీగా పడిపోయింది. సుమారు 80 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోయాయి. జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 3,07,684 టన్నులు ఉండగా.. ఫిబ్రవరిలో 1,40,000 టన్నులకు పడిపోయాయి. జనవరిలో పోలిస్తే ఫిబ్రవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 22 శాతం పడిపోయాయి. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీగా గిరాకీ ఏర్పడింది.…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు కోహ్లీ మీదే పడ్డాయి. అతడు సెంచరీ చేయక 833 రోజులు దాటిపోతోంది. ఈ మ్యాచ్‌లో అయినా తమ స్టార్ ఆటగాడు సెంచరీ దాహాన్ని తీర్చుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 45 పరుగులకే అవుటయ్యాడు. ఎంబుల్దెనియా బౌలింగ్‌లో…
మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే, వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీపైనే అందరీ కళ్లు ఉన్నాయి. మొహాలీ వేదికగా జరిగే టెస్టులో… సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు… మరో 38 పరుగులు చేస్తే… 8వేల పరుగులు చేసిన ఆరో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నారు. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరంద్ర సెహ్వాగ్… దేశం తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు…
భారత్-శ్రీలంక జట్ల మధ్య రేపు జరగనున్న తొలి టెస్ట్‌కు… ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. టీమిండియాలోని విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలకు ఈ మ్యాచ్ మైలురాయి కానుంది. 100వ టెస్ట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఒకరైతే.. సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్ బాధ్యతలు చేపడుతున్న రోహిత్ శర్మ మరొకరు. మొహాలీ టెస్ట్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని కోహ్లీ, రోహిత్ భావిస్తున్నారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ గెలుపొందిన భారత్…ఆ తర్వాత లంకతో మూడు టీ20ల సిరీస్‌ను వైట్…