ఎంత ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పటికి ఐపీఎల్‌కున్న క్రేజ్ 15 ఏళ్లలో ఏమాత్రం తగ్గలేదన్నది క్రీడానిపుణులు ఉవాచ. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్స్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్‌లో టైటిల్ కొట్టి గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. అయితే మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ అనే అంశం తెరమీదకు వచ్చింది. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం నుంచి అందరూ ఊహించినట్లుగానే హార్దిక్ సేన కప్ కొట్టడంపై సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్, మీమ్స్ వైరల్ గా మారాయి. నిజంగానే గుజరాత్ గెలిచిందా? గెలిపించారా?