కరోనా మహమ్మారి తర్వాత పెళ్ళిళ్ళు బాగా పెరిగాయి. అయితే ఈ పెళ్ళి వేడుకల్లో విచిత్రమయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఉల్లిధరలు పెరిగినప్పుడు ఉల్లి దండలు బహుమతులుగా ఇచ్చేవారు. కొత్తగా పెళ్లయినవారికి ఉల్లిపాయలు పెట్టి గిఫ్ట్ బాక్సులు అందించేవారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్.. ధరలంటే జనాలు భయపడిపోతున్నారు. రోజుకి ఇంచుమించుగా రూపాయి పెంచుతూ చమురు సంస్థలు వినియోగదారులను ఎడాపెడా బాధేస్తున్నాయి. https://ntvtelugu.com/viman-restaurant-viral-in-vijayawada/ ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్…
* నేడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సర్వ ప్రతినిధి సభ అత్యవసర భేటీ.. ఐరాస హెచ్ఆర్సీ నుంచి రష్యాను సస్పెండ్ చేసే ప్రతిపాదనపై నేడు ఓటింగ్ * నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ, సమావేశం తర్వాత రాజీనామా చేయనున్న ప్రస్తుత మంత్రులు * కొరియా ఓపెన్ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లో సింధు, కిదాంబి శ్రీకాంత్.. నేడు ప్రిక్వార్టర్స్‌లో ఓహోరి (జపాన్)తో తలపడనున్న సింధు, నేడు ప్రిక్వార్టర్స్‌లో మిషా జిల్టర్మన్…
దేశంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై బుధవారం రాజ్యసభలో ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జెనీవాలోని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ విడుదల చేసిన వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ (డబ్ల్యూఆర్ఎస్) 2018 ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. మరోవైపు రోడ్డుప్రమాదాల్లో క్షతగాత్రుల విషయంలో మాత్రం భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2020 సంవత్సరానికి 18…
ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్.. థర్డ్ వేవ్… వరుసగా మూడు కరోనా వేవ్‌లను చేశాం.. ఈ సమయంలో.. ఎన్నో వేరియంట్లు వెలుగు చూశాయి.. కొన్ని ప్రమాదకరంగా మారగా.. కొన్ని అంతగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి తగ్గుతోన్న తరుణంలో… కొత్తరకం వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ భారత్‌లోనూ వెలుగుచూసింది. తొలి కేసు ముంబైలో నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతేకాకుండా కప్పా…
కరోనా సంక్షోభంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు పెట్టుబడుల విషయంలో అల్లాడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విదేశీ పెట్టుబడులు పెరిగాయి. తాజాగా ఇన్వెస్ట్ ఇండియా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలవడంతో ఈ విషయం బహిర్గతమైంది. 2019 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు రాష్ట్రంలో 451 అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఏపీకి వచ్చాయిని ది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలియేషన్ ఏజెన్సీ ఆఫ్ ది గవర్నమెట్…
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టెన్షన్ కాస్త తగ్గిపోయింది… భారత్‌లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్‌లో కొత్తగా వెలుగు చూసిన కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్ రూపంలో భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమై మరోసారి కలవరపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. దీంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ…
గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముద్ర గతంలో ఎన్నడూ లేనంత అల్ప స్థాయికి పడిపోయింది. దాంతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన రాజకీయ పార్టీ తన జాతీయ ప్రాముఖ్యతను కోల్పోతోందని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల విస్తరణతో దశాబ్దాలుగా భారత రాజకీయాలపై గల తన ఆధిపత్య శక్తిని కోల్పోతోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ…
కరోనాకు పుట్టినిల్లయిన చైనా ఇప్పుడు మళ్ళీ కరోనా టెన్షన్ తో అతలాకుతలం అవుతోంది. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. చైనాలో సోమవారం 13 వేలకు పైగా కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. షాంఘైలోనో 70 శాతం కేసులు వెలుగులోకి రావడంతో చైనా అప్రమత్తం అయింది. కేసుల నివారణకు 2 వేల మంది సైన్యం, 15 వేలమంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్కరికి రెండు పరీక్షలు…
మహిళల వరల్డ్ కప్ ముగియడంతో టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రత్యేకంగా ఓ జట్టును రూపొందించింది. ఈ మేరకు ఈ జట్టు వివరాలను సోమవారం ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ జట్టులో భారత మహిళలకు చోటు దక్కలేదు. చివరకు బంగ్లాదేశ్ మహిళలకు కూడా ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన జట్టులో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లకు.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు స్థానం…
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వరిధాన్యం విషయంలో యుద్ధం సాగుతూనే వుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వ్యతిరేకంగా లోకసభలో ప్రివిలైజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటు ను, దేశ ప్రజలని, రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పెట్టించారని సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) నోటీసులో పేర్కొన్నారు. నోటీసును స్పీకర్ ఓంబిర్లాకు అందజేశారు టీఆర్ ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు,కొత్త ప్రభాకర్…