భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. అయితే, నిన్నటితో పోలిస్తే రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. అయినా 11 వేలకు పైగానే కొత్త కేసులు నమోదు అయ్యాయి.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,793 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 27 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 9,486 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతంగా ఉంది.. ఇక, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతంగా ఉన్నాయి.. ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,418,839కు చేరుకోగా.. మరణాల సంఖ్య 5,25,047కు పెరిగింది.. ఇక, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 96,700గా ఉండగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4,27,97,092కు చేరింది.. మరోవైపు.. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొంత వేగం తగ్గింది.. ఇప్పటి వరకు 1,97,31,43,196 డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది..
Read Also: ATA Celebrations 2022: జోరుగా ‘ఆటా’ మహాసభల ఏర్పాట్లు..