సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై శుక్రవారం దేశం భగ్గుమంది. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలో సైన్య నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాల్లో యువత ఆందోళనలు చేపట్టింది. ఇవి కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. ‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి దేశంలో కేవలం 2,3 వేలకు పరిమితం అయిన రోజూవారీ కేసులు సంఖ్య తాాజాగా పదివేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,847 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,063గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి 14 మంది…
దేశంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఆయా రాష్ట్రాల అప్పుల వివరాలను ప్రకటించింది. దేశంలో అప్పుల భారం ఎక్కువగా ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్దారించిన రుణ, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్ దాటేసిందని ఆర్బీఐ వివరించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత అధికంగా జీఎస్డీపీలో…
చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హ్యుందాయ్ వెన్యూ ఫెస్ లిఫ్ట్ కార్ తాజాగా ఈ రోజు మార్కెట్ లోకి వచ్చింది. కార్ మార్కెట్లకు రాకముందే విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఏకంగా 15 వేలకు పైగా ప్రీబుకింగ్స్ అయ్యాయి. గతంలో వెన్యూతో పోలిస్తే ప్రస్తుతం అనేక మార్పులతో, లగ్జరీ, కంఫర్ట్ ఫీచర్లలో వెన్యూ ఫెస్ లిఫ్ట్ వెర్షన్ మార్కెట్ లోకి వస్తుంది. మొత్తం ఆరు వేరియంట్లలో వెన్యూ లభిస్తోంది. ఈ, ఎస్, ఎస్(ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(ఓ) వేరియంట్లతో వెన్యూ మార్కెట్…
దేశంలో వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు తగ్గింపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో మరో వారంలో హోల్‌సేల్ మార్కెట్లలో నూనె ధరల తగ్గింపు అమలు కానుంది. పామాయిల్‌పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై రూ.10 నుంచి 15 వరకు, సోయాబీన్‌పై రూ.5 తగ్గే అవకాశం ఉంది. మే నెలలో వంట నూనెల కేటగిరిలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. దీంతో…
భారత దేశ కంపెనీ ‘ తాజ్ ’ మరో ఘనత సాధించింది. 2022కు గానూ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ హెటల్ బ్రాండ్ గా తొలిస్థానంలో నిలిచింది. బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ “బ్రాండ్ ఫైనాన్స్” యొక్క తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ హెటల్ బ్రాండ్స్ లో తాజ్ హెటల్ బ్రాండ్ టాప్ లో నిలిచింది. తాజా నివేదిక ప్రకారం టోటల్ బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ లో 100 పాయింట్లకు గానూ 88.9 రేటింగ్ సాధించింది. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, ఉద్యోగుల…
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్క్రమ్ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన అతడు మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆడడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చెప్పింది. పాజిటివ్‌గా తేలిన తర్వాత మార్క్రమ్ ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడు తిరిగి జట్టుతో చేరి సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయంతో బాధపడుతున్న డికాక్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్రికెట్…
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సమావేశాలను యూఎస్ఏ నిర్వహించనుంది. ఈ భేటీ నాలుగు దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి అక్షరాలను కలిపి ఐ 2గా, యూఎస్ఏ, యూఏఈని కలిపి యూ 2 గా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్ ను పశ్చిమాసియా క్వాడ్ గా కూడా అభివర్ణిస్తారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గోధుమ సంక్షోభం నెలకొంది. గోధుమను ఎక్కువగా పండించే రష్యా, ఉక్రెయిన్ లు యుద్ధంలో ఉండటంతో గోధుమ కొరత ఏర్పడోంది. ప్రపంచంలోనే గొధుమలను ఎక్కువగా పండించే రెండో దేశంగా భారత్ ఉంది. అయితే భారత్ కూడా తన దేశ అవసరాల నిమిత్తం ఇటీవల గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దీనిపై ఈయూ దేశాలు తీవ్ర అభ్యంతరం కూడా తెలిపాయి. భారత దేశంలో ఆహార భద్రత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే క్రెడిట్…
కరోనా నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనా విధించిన ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఆగిపోయిన భారతీయ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు డ్రాగన్ శుభవార్త తెలిపింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్ వీసా పాలసీ అప్డేట్ చేసిం ది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబసభ్యులు, చైనాలో శాశ్వత…