PFI: పీఎఫ్ఐ ట్విటర్ ఖాతా నిలిపివేత.. నిషేధం విధించిన మరుసటి రోజే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI: నిషేధిత గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మరుసటి రోజే సామాజిక మాధ్యమాల్లో ఆ సంస్థకు సంబంధించిన ఖాతాలు నిలిపివేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎఫ్ఐ అధికారిక ఖాతాలను ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు తొలగించాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఫేస్‌బుక్ పేజీ, ఇన్‌స్టా ప్రొఫైల్ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. ట్విటర్‌లో పీఎఫ్‌ఐ సంస్థ ఖాతాకు దాదాపు దాదాపు 81,000 మంది అనుచరులు ఉన్నారు.
దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు యువతను ఐసిస్, లష్కరే తొయిబా, ఆల్‌ఖైదా వంటి ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని పీఎఫ్‌ఐ సంస్థపై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తూ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాల కార్యకలాపాలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐ ప్రచారానికి డిజిటల్ మాధ్యమం ద్వారా పాల్పడుతుందనే ఆలోచనల దృష్ట్యా.. దానికి సంబంధించిన అన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం నిలిపివేసింది.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ఉద్విగ్న సన్నివేశం.. ఉబ్బితబ్బిబ్బైన చిన్నారి
పీఎఫ్‌ఐకి సంబంధించిన పలువురు నాయకుల ఖాతాలను కూడా ట్విటర్ నిలిపివేసింది. 50,000 కంటే తక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్న దాని ఛైర్మన్ ఓఎంఏ సలామ్, 85 వేల ఫాలోవర్లను కలిగి ఉన్న ప్రధాన కార్యదర్శి అనిస్ అహ్మద్‌కు చెందిన ఖాతాలను కూడా ట్విటర్ నిలిపివేసింది. పీఎఫ్‌ఐ నిషేదానికి ముందు అరెస్టయిన నాయకుల్లో వారిద్దరు కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!