Dutee Chand: అథ్లెటిక్స్‌లో ఒడిశాకు చెందిన ద్యుతీచంద్ ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ స్ర్పింటర్‌గా కొనసాగుతోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎన్నో ఆటుపోట్లను దాటుకుని వచ్చి స్టార్ అథ్లెట్‌గా ఎదిగింది. కొన్నేళ్ల కిందట తాను స్వలింగ సంబంధంలో ఉన్నానంటూ ఆమె భారత క్రీడారంగాన్ని ఆశ్చర్యపరిచింది. తాను స్వలింగ సంపర్కురాలినని బహిరంగంగా చెప్పిన భారత తొలి అథ్లెట్ ద్యుతీచంద్ కావడం గమనించాల్సిన విషయం. తాజాగా ఆమె తన ప్రేయసి మోనాలీసాను పరిచయం చేసింది. ఈ మేరకు…
America's warning on China's objections: భారత్, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ‘యుద్ అభ్యాస్’పేరుతో ఉత్తరాఖండ్ లో ఇరు దేశాల సైనికులు సైనిక విన్యాసాలు చేస్తున్నారు. చైనా సరిహద్దు ఎల్ఓసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. అయితే ఈ సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ 1993,96 ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో భారత్ కు అండగా నిలిచింది అమెరికా.
గాప్పమనసు చాటుకున్న సీఎం జగన్.. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నిరుపేద బిడ్డ … లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని.. మీరు నిశ్చితంగా ఉండాలంటూ తన దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.. ఈ ఘటన శుక్రవారం సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా…
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత మహిళ జట్టును ప్రకటించారు. భారత్‌లోనే జరగనున్న ఈ టీ-20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Russia Refuses To Provide Pakistan 30-40% Discount On Crude Oil: దాయాది దేశం పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది రష్యా. భారతదేశం, పాకిస్తాన్ ఒకటి కాదని చెప్పకనే చెప్పింది. ఆర్థిక కష్టాల్లో పాకిస్తాన్ చమురు కోసం అల్లాడుతోంది. అయితే భారత్ కు ఇచ్చిన విధంగానే మాకు కూడా డిస్కౌంట్ కు చమురు ఇవ్వాలని రష్యాను కోరింది. అయితే పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను నిరాకరించింది. రష్యా ముడి చమురుపై 30-40 శాతం తగ్గింపు ఇవ్వలేమని స్పష్టం…
డిసెంబర్ నెలలో 15 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భ్రమణ అధ్యక్ష పదవిని భారతదేశం గురువారం స్వీకరించింది. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పలు ఈవెంట్లను భారత్ నిర్వహించనుంది.
నిషేధిత ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా.. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్‌ను సవరించింది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా రూ.…