US Looks Forward To Continue Working With Pakistan: అమెరికా ఎప్పుడూ తన ప్రయోజనాలనే ముందు చూసుకుంటుంది. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్నామనే కలరింగ్ ఇస్తూనే.. తన లాభాన్ని చూసుకుంటుంది. ఇది మరోసారి రుజువైంది. భారతదేశం తమకు అత్యంత సన్నిహిత దేశం అని చెబుతూనే దాయాది దేశం పాకిస్తాన్ కు సహరిస్తుంది. ఆర్థికంగా, సైనికంగా ఇటీవల కాలంలో పాకిస్తాన్- అమెరికాల మధ్య మళ్లీ బంధం బలపడుతోంది.
China warns US not to interfere in its relationship with India: భారత్-యూఎస్ఏ మిలిటరీ డ్రిల్స్పై డ్రాగన్ కంట్రీ చైనా తన అక్కసును వెళ్లగక్కుతోంది. చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఇరు దేశాల సైనిక విన్యాసాలు జరగడంపై అభ్యంతరం తెలిపింది. భారత్-అమెరికా దేశాలు ఎల్ఎసీకి సమీపంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ‘యుధ్ అభ్యాస్’పేరుతో మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఈ విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇది తనకు…
న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డేను న్యూజిలాండ్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.
ఏపీకి కొత్త సీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది… ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రిటైర్ కానుండగా.. అదే రోజు అంటే రేపు సాయంత్రం జవహర్ రెడ్డి బాధ్యత స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసిపోయింది.. కానీ, ప్రభుత్వం ఆయన…
Israeli diplomats apologize to India over Kashmir file issue: గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమంలో జ్యూరీ హెడ్, ఇజ్రాయిల్ దేశానికి చెందిన నాదవ్ లాపిడ్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన వంటి పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేవిగా ఉండటంతో ఇజ్రాయిల్ డిప్లామాట్స్ రంగంలోకి దిగారు. నాదవ్ లాపిడ్ చేసిన…
Reliance Jio: దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం కలిగింది. నెట్వర్క్ డౌన్ కావడంతో జియో ఇంటర్నెట్, కాల్స్, ఫైబర్ సేవలు నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జియో నెట్ వర్క్లో సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జియో నెట్వర్క్ నుంచి కాల్స్ చేసుకునేందుకు, మాట్లాడేందుకు కుదరట్లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్లు పంపించేందుకు…