ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. పిడికిలి బిగించి అభివాదం
లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ ఆఫీసు చేరుకున్న కవిత… అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గర అభిమానులకు.. పిడికిలి బిగించి అభివాదం చేశారు. కవితకు మద్దతుగా ఈడీ ఆఫీసు గేట్ వరకూ వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, లాయర్లు సైతం ఉన్నారు. అయితే, వాళ్లను ఆఫీస్ గేటు దగ్గరే ఆపేశారు పోలీసులు.కేవలం కవితను మాత్రమే అనుమతించారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. కవితకు బినామీగా చెబుతున్న పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సిసోడియాను శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో వారిద్దరితో వేర్వేరుగా, కలిపి కూడా కవితను ప్రశ్నించే అవకాశముంది. నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. కవిత పలుసార్లు ఫోన్లు మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. సౌత్ గ్రూప్‌కు సంబంధించిన లావాదేవీలపై కవితను ఈడీ ప్రశ్నించనుందని సమాచారం. సౌత్ గ్రూప్‌లో కవితకు 33 శాతం వాటాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి. రామచంద్రన్ పిళ్లై సౌత్ గ్రూప్‌తో కవితకు బినామీగా ఉన్నారని, కవిత ప్రతినిధిగా ఆయన వ్యవహరించినట్లు ఈడీ పేర్కొంది.
వివేకా కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు
సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ కొనసాగుతోంది, విచారణ సాగే కొద్ది సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాంత ఈ కేసు క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది.ప్రస్తుతం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతోంది. ఇక ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ గా మతాజారోసారి ప్రశ్నించింది. ఇంతకు ముందు కోర్టు ఆయనను రెండు సార్లు ప్రశ్నించింది. ఐతే ఈ సారి విచారణ సందర్భంగా సీబీఐ ఆయనను అరెస్టు చేస్తుందని అంతా అనుమానించారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి కీలక అంశాలు బయటకొచ్చాయి. వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్లో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. వివేకా రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రక్రియలో.. ఆయన హత్య జరిగి ఉండొచ్చని వైసీపీ ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. 2010లో షేక్ షమీమ్ అనే మహిళను వివేకా వివాహం చేసుకున్నారని.. రెండో వివాహంతో ఆయన కూతురు సునీతతో సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతిక పొత్తులకు బుద్ధి చెప్పండి
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారం ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి ధీటుగా టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పరస్పర సహకారంతో ముందుకెళుతున్నాయి. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తూర్పు రాయలసీమ పట్టభద్రులు ,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై.సి.పి. అభ్యర్థులను ఆశీర్వదించండి. వైసీపీని ఎదుర్కోలేక ఓటమి భయంతో టీడీపీ ,పిడిఎఫ్ లు అనైతిక పొత్తులు పెట్టుకున్నాయి. విశాఖ గ్లోబల్ సమ్మిట్ తో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు రావటమే సీ.ఎం. జగన్ పనితీరుకు నిదర్శనం అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాదిమందికి ఉపాధి కలగబోతోంది. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ,పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ఘన విజయం సాధించబోతున్నారు. 13 వ తేదీ ప్రతీ ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోండి..నెల్లూరులో కొందరు నేతలు నాపై పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటిని పట్టించుకోను..అలాంటి నేతలు ఏమవుతున్నారో అందరూ చూస్తున్నారన్నారు అనిల్ కుమార్ యాదవ్.
కమలం గూటికి కిరణ్ కుమార్ రెడ్డి
ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది. మంచి గ్లామర్ ఉన్న నాయకుడు బీజేపీకి కరువైన వేళ.. ఆపరేషన్ ఆకర్ష్ వైపు బీజేపీ హైకమాండ్ అడుగులు వేస్తోంది. త్వరలో బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా రాజకీయంగా అంతగా యాక్టివ్ గా లేరు కిరణ్ కుమార్ రెడ్డి, తాజాగా బీజేపీ జాతీయ నాయకత్వంతో టచ్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కీలక పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతోన్న క్రమంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఏపీ బీజేపీలో ఇమేజ్ ఉన్న లీడర్ లేకపోవడంతో కిరణ్ ను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోన్న బీజేపీ ఆదిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జాతీయ స్థాయిలో పదవి కట్టబెడతామని కిరణ్ కు బీజేపీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చెయనున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల ఏపీ కాంగ్రెస్ పై ఫోకస్ పెంచాలని భావించారు. కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. అయితే, కాంగ్రెస్ లో ఉండేందుకు కిరణ్ కుమార్ రెడ్డి అంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి స్తబ్ధుగా ఉన్నారు. ఇటీవల బీజేపీలో కీలక పాత్ర పోషించిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ బీజేపీలో బలమయిన నేత లేరు.
కేసీఆర్ కుటుంబాన్ని వేధించడంలో మోదీ బిజీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను హాజరవుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎంపీలు ముస్లింలను ఆర్థికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలన్నారు. కానీ మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని వేధించడంలో బిజీగా ఉంది అంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు.కాగా.. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ హాజరువుతున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో కవిత భేటీ అయ్యారు. ఢిల్లీలో కవితకు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకుని కవితను కలిశారు. కవిత విచారణతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవితను ఏ ఏ ప్రశ్నలు అడుతారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.
హోలీ వేడుకల్లో వేధింపులు..దేశం వీడిన బాధితురాలు
హోలీ వేడుకలు సందర్భంగా ఢిల్లీలో జపాన్‌కు చెందిన ఓ మహిళను కొందరు యువకులు వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ వేధింపులకు పాల్పడిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన జపాన్ యువతి ఢిల్లీలోని పహర్గంజ్లో ఉంటోంది. హోలీ వేడుకల సందర్భంగా ముగ్గురు యువకులు సదరు యువతిపై బలవంతంగా రంగులు చల్లి, కోడి గుడ్లు కొట్టారు. కోడిగుడ్డు కొట్టి ముఖమంతా పులిమారు. ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ యువకుడిపై చేయి కూడా చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పహాడ్‌గంజ్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్టు చెప్పారు. అయితే.. యువతి మాత్రం నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఇక ఘటన అనంతరం జపాన్ యువతి తన పర్యటనను కొనసాగించింది. తాజాగా బంగ్లాదేశ్ చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది. ప్రస్తుతం తాను శారీరకంగా, మానసికంగా పూర్తి ఫిట్‌గా ఉన్నానని యువతి చెప్పింది.
HUL కి కొత్త అధిపతి.. మరిన్ని బిజినెస్ న్యూస్
హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రోహిత్ జవా నియమితులయ్యారు. సంజీవ్ మెహతా రిటైర్ కానుండటంతో ఆయన స్థానంలో రోహిత్ జవా రానున్నారు. ఈయన ఇప్పుడు ఇదే సంస్థలో చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త పదవీ బాధ్యతలను ఈ ఏడాది జూన్ 27వ తేదీన చేపట్టి ఐదేళ్లపాటు కొనసాగుతారు. రోహిత్ జవా నియామకానికి స్టాక్ హొల్డర్ల అంగీకారం పొందాల్సి ఉందని హిందుస్తాన్ యూనిలీవర్ తెలిపింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను మూసివేశారు. నియంత్రణ సంస్థలు ఈ బ్యాంక్ ఆస్తులను జప్తు కూడా చేసుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్టార్టప్‌లు సైతం షాక్‌కు గురయ్యాయి. శాంతాక్లారా ప్రాంతంలోని SVB అనే ఫైనాన్షియల్ గ్రూప్‌నకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో 16వ స్థానంలో ఉంది. టెక్ బేస్డ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్లకు నిధులు ఇస్తుంది. వాటాల విక్రయ ప్రకటనతో తాజా పరిస్థితి తలెత్తింది.
ఫిబ్రవరిలో గరిష్టానికి పీఎంఐ
ఈ ఏడాది ఫిబ్రవరిలో సేవల రంగం అద్భుతమైన పనితీరును కనబరిచింది. అత్యంత బలమైన స్థాయిలో విస్తరించింది. తద్వారా 12 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అనుకూల గిరాకీ పరిస్థితులు నెలకొనటం, కొత్త వ్యాపార లాభాలు నమోదు కావటం కలిసొచ్చింది. దీంతో.. S & P గ్లోబల్ ఇండియా PMI భారీగా పెరిగింది. ఈ సూచీ విలువ జనవరిలో 57 పాయింట్ 2 వద్ద ఉండగా ఫిబ్రవరిలో 59 పాయింట్ 4కి చేరింది. సర్వీస్ సెక్టార్ ఈ రేంజ్లో రాణించటం.. అంటే.. 2 పాయింట్ 2 పెరగటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి. వరుసగా 19వ నెలలో హెడ్లైన్ ఫిగర్ న్యూట్రల్ 50 థ్రెషోల్డ్‌కి పైనే ఉండటం విశేషం. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్.. PMI పరిభాషలో చెప్పుకున్నప్పుడు ఈ విలువ 50 కన్నా ఎక్కువ ఉంటే విస్తరణకు సూచికని, తక్కువ ఉంటే సంకోచానికి సంకేతమని నిపుణులు చెప్పారు. పోయిన నెలలో సేవల రంగ సంస్థల మధ్య పోటీ వల్ల ధరలు దిగొచ్చాయని, ఫలితంగా సేల్స్ పెరిగాయని తెలిపారు.
అశ్విన్ అద్భుత ప్రతిభ.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక ఐదు వికెట్లు తీశాడు
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో టెస్ట్ క్రికెట్లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడంతో.. అశ్విన్ ఈ రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. భారత గడ్డపై ఆయన టెస్టుల్లో 25 సార్లు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేశారు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో 26వ సారి 5 వికెట్ల హాల్ సాధించి, కుంబ్లే రికార్డ్‌ని అశ్విన్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అశ్విన్‌కి ఇది 32వ ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఇదే సమయంలో అశ్విన్ మరో సంచలన రికార్డ్‌ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు 111 వికెట్లతో అనిల్ కుంబ్లే పేరిట ఆ రికార్డ్ ఉండగా.. 113 వికెట్లతో అశ్విన్ ఆ రికార్డ్‌ని పటాపంచలు చేశాడు. భారత బౌలర్లలో ఈ ఇద్దరు మినహా మరెవ్వరు ఆస్ట్రేలియాపై 100 వికెట్లకు మించి తీయలేదు.
ఇలాగే కొనసాగితే, ఆ ఇద్దరి కెరీర్లు గల్లంతే.. బ్రాడ్ హాగ్ సంచలన కామెంట్స్
టీ20, వన్డేల్లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లోనూ అదే జోరు కొనసాగిస్తాడని అంతా అనుకున్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు.. అందరూ అదే అంచనాలు పెట్టుకున్నారు. తీరా చూస్తే.. మూడు మ్యాచ్‌లు ముగిసినా, కోహ్లీ నుంచి ఒక్క ఆశాజనకమైన ఇన్నింగ్స్ రాలేదు. మూడో టెస్టుల్లోనూ అతడు ఘోరంగా విఫలమయ్యాడు. అతనితో పాటు ద్రవిడ్ తర్వాత ఇండియన్ వాల్‌గా గుర్తింపు పొందిన ఛటేశ్వర్ పుజారా సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క మ్యాచ్‌లో అర్థశతకం సాధించాడే తప్ప.. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా తనదైన ముద్ర చూపించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే వీరి భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ‘కొంతకాలం నుంచి పుజారా, విరాట్ కోహ్లీ టెస్టుల్లో బాగా ఇబ్బంది పడుతున్నారు. కోహ్లీ వన్డే, టీ20ల్లో రాణించినా.. టెస్టుల్లో మాత్రం శతకం కోసం నిరీక్షణ తప్పట్లేదు. ఇక పుజారా గొప్ప ఫామ్‌లో లేడు. అతడు మునుపటిలా భారీ స్కోర్లు మలచలేకపోతున్నాడు. అయితే.. వీరిద్దరు మంచి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తర్వాత విరాట్ పుంజుకుంటాడని నేను భావిస్తున్నా.