India vs Australia Test: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలిటెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఇన్నింగ్ 132 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని ఆస్ట్రేలియా మీడియా జీర్ణించుకోలేకపోతోంది. ఆసీస్ టీమ్ పై దారుణంగా విమర్శలు చేస్తోంది. ఈ ఓటమిని ‘అవమానకరమైన ఓటమి’గా అభివర్ణిస్తోంది. రెండో టెస్టుకు మార్పులతో బరిలోకి దిగాలని సూచించింది. స్పిన్ తో ఆసీస్ కు చుక్కలు చూపించిన అశ్విన్, రవీంద్ర జడేజాలపై ప్రశంసలు కురపిస్తోంది అక్కడి మీడియా.
Canada: అమెరికాలో చైనీస్ స్పై బెలూన్ కలకలం రేపిన కొన్ని రోజుల్లోనే ఆకాశంలో అనుమానాస్పద వస్తువుల గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా కెనడా గగనతంలో మరో అనుమానాస్పద ఉన్న ‘అన్ ఐటెంటిఫైడ్ అబ్జెక్ట్’ను గుర్తించారు.. దీన్ని శనివారం కెనడా, అమెరికా కలిసి కూల్చేశాయి. అమెరికా ఫైటర్ జెట్లు దీన్ని కూల్చేశాయి. ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ధృవీకరించారు. యూఎస్ కు చెందిన ఎఫ్- 22 విమానం ఈ వస్తువును కూల్చేసింది. రెండు రోజుల్లో ఇది రెండో…
All about lithium, could change India's fate: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో చాలా విలువైన లిథియం ఖనిజం భారీ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఏకంగా 60 లక్షల టన్నుల ఖనిజం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ లిథియం భారతదేశ భవితను మార్చబోతుందా..? అంటే ఔననే సమాధానం వస్తుంది. కాస్మిక్ మెటల్ గా పేరొందిన లిథియంకు ప్రస్తుతం మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది. రాబోయే కాలం ఎలక్ట్రానిక్స్, ఈవీ…
దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలతో కూడిన రెండో బ్యాచ్ ఫిబ్రవరి 18న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కి చేరుకుంటుందని సీనియర్ అటవీ అధికారి శనివారం తెలిపారు.
Jamiat Ulama-i-Hind: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లాగే భారతదేశం తమకు చెందినది అని జమియత్-ఉలమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీ అన్నారు. ఢిల్లీలో ప్రారంభమైన జమియత్ ఉలామా-ఇ-హింద్ ప్రారంభోత్సవ ప్లీనరీ సమావేశంలో మౌలానా మదానీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ, భగవత్ లకు ఈ దేశంపై ఎంత హక్కు ఉందో మహమూద్ మదానీకి కూడా అంతే హక్కు ఉందని అన్నారు. వారి కన్నా తాను దేశం కోసం ఒక్క అంగుళం ముందే…
China Spy Balloon: అమెరికా, చైనాల మధ్య స్పై బెలూన్ వివాదం నడుస్తూనే ఉంది. చైనా బెలూన్ సాయంతో పలు దేశాలపై గూఢచర్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. చైనా ఆర్మీ ఏకంగా బెలూన్ ప్లీట్ ను నిర్వహిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ కనిపించింది. దీన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. దీనిపై ప్రస్తుతం అక్కడి అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. బెలూన్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఏ శాటిలైట్ తో ఈ…
Turkey Earthquake: టర్కీ, సిరియా భూకంపంలో అంతకంతకు మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం టర్కీలో 7.8, 7.5 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చాయి. ఏకంగా 1000కి మించి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో టర్కీ, సిరియాలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల టర్కీలో 17,674 మంది, సిరియాలో 3,377 మంది మరణించారని, మొత్తం 21,051 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
Indian Citizenship: వృత్తి, ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2022లో 2,25,620 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రకటించింది. పార్లమెంట్ లో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులపై అడిగిన ఓ ప్రశ్నకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.