Natasha Perianayagam: భారతీయ-అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగం(13) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే తెలివైన విద్యార్థినిగా వరసగా రెండో ఏడాది మొదటిస్థానంలో నిలిచింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నిర్వహించిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్(సీవైటీ) పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచారు నటాషా. 76 దేశాల్లోని 15,000 మంది ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. కేవలం 27 శాతం కంటే తక్కువ మంది ఈ పరీక్షల్లో అర్హత సాధించారు. వీరిలో నటాషా తొలిస్థానంలో నిలిచారు.
Turkey-Syria Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో వచ్చిన భూకంపం ఆ దేశాలను మరుభూమిగా మార్చాయి. ఎక్కడ చూసిన ప్రజల ఏడుపులు, కూలిన కట్టడాలే దర్శనం ఇస్తున్నాయి. సోమవారం వచ్చిన వరస భూకంపాల ధాటికి ఆ రెండు దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 7.8, 7.6, 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపాలు టర్కీ, సిరియాలను అతలాకుతలం చేశాయి.
Indians invest in Fixed Deposit: పొదుపు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలకు అంతే లేదు.. అయితే.. భారతీయులు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.. అసలు భారతీయులకు ఎఫ్డీలు అంటే ఎందుకంత మక్కువ? అనే అంశాలపై ఓ సర్వే ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది.. భారతదేశంలోని వ్యక్తులు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణాలను ఆ సర్వే కనుగొంది. ఎఫ్డీలు పెట్టడానికి మార్కెట్ అస్థిరత నుండి భద్రత ఒక ప్రధాన…
Pervez Musharraf: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారప్(79) దీర్ఘకాలిక అనారోగ్యంతో దుబాయ్ లో ఆదివారం మరణించారు. కరుడుగట్టిన భారత వ్యతిరేకిగా ముద్రపడిని ముషారఫ్ అంచెలంచెలుగా ఎదిగి పాకిస్తాన్ నియంతగా మారాడు. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని పాకిస్తాన్ ను సైన్యం కనుసన్నల్లో పాలించాడు. చివరకు స్వదేశంలో దేశద్రోహం నేరాలు ఎదుర్కోవడమే కాకుండా తనను వ్యతిరేకించి వారిని సైన్యం సహాయంతో అణిచివేశాడు. చివరకు తనకు మద్దతు ఇచ్చిన బెనజీర్ భుట్టో వంటి వారిని హతమార్చాడనే అభియోగాలు…