India's Russian Oil Imports Hit Record High: ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఫిబ్రవరిలో ఈ దిగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ప్రస్తుతం 35 శాతం చమురు దిగుమతుల వాటాను రష్యా దక్కించుకుంది.
Danger to Chennai and Kolkata: పెరుగున్న వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓజోన్ లేయర్ దెబ్బతినడంతో పాటు భూమిపై హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని, దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ముప్పు ఏర్పడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ చాలా తెలివిగా ఓ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చారు. రెండు దేశాలలో నివసించడానికి, పని చేయడానికి యువ బ్రిటీష్, భారతీయ నిపుణుల కోసం కొత్త మార్పిడి పథకాన్ని ప్రారంభించారు.
Antony Blinken: ఇండియా ఈ ఏడాది జీ20 సమావేశాల అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా ప్రస్తుతం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు భారత్ లో జరుగుతున్నాయి. దీంతో పాటు అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ‘క్వాడ్’ సమావేశం కూడా శుక్రవారం జరిగింది. కాగా ఢిల్లీలో జరగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆటో రిక్షాలో కార్యక్రమానికి వచ్చారు. తాను ఆటోలో వచ్చిన ఫోటోలను…
Air Pollution : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జనాలు గాలి పీల్చుకునేందుకు జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంలో గాలి నాణ్యత ఎన్నడూ లేనంత దారుణ స్థాయికి పడిపోయింది.
Russia: భారత్ ప్రతీష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారత్ జీ20కి అధ్యక్షత వహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు భారత్ పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరుపై చర్చించాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే పాశ్చాత్య దేశాలు మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సమావేశాల్లో లేవనెత్తాలని చూస్తున్నాయి. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగి జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా యుద్ధంపై ఏకాభిప్రాయం కోసం…
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియాకు మూడో టెస్టువో మాత్రం ఆస్ట్రేలియా గట్టి పోటీనిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
February Temperature: ఎండాకాలం ఇంకా పూర్తిగా రానేలేదు. అప్పుడు సూర్యుడు తన ప్రకోపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత నమోదు అయింది. ఉదయం పూట కాస్త చలిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.