India at UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే స్పందించింది. మహిళలు, శాంతి మరియు భద్రతపై భద్రతా మండలి చర్చలో పాక్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ మానవహక్కులపై తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలపై భారత్ విరుచుకుపడింది. ఇటువంటి ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు భారత్ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
India wheat To Afghanista: ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సాయాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్పై భారత్-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదలైంది.
ISRO: ఇస్రో మరోసారి సత్తా చాటింది. దశాబ్ధకాలంగా సేవలు అందిస్తూ, జీవిత కాలం ముగిసిపోయిన మేఘా ట్రోపిక్-1 శాటిలైన్ ను విజయవంతంగా ధ్వంసం చేసింది ఇస్రో. అత్యంత కట్టుదిట్టమైన ప్లానింగ్ లో పసిఫిక్ మహాసముద్రంలో జనావాసాలకు దూరంగా కూల్చివేసింది. అక్టోబర్ 2011లో లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టబడిన మేఘా ట్రోఫిక్-1 ఉష్ణమండల వాతావరణం గురించి విలువైన సమాచారాన్ని దశాబ్ధకాలంగా అందిస్తూ వస్తోంది. భారత్, ఫ్రెంచ్ సంయుక్తంగా ఈ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపాయి.
Rahul Gandhi: బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని కలలు కంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం లండన్ లో జరిగి చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్‌లో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు.