India’s Forex Reserves: మళ్లీ తగ్గిన భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, ఈ నెల 9వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 593.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీనికి ముందు వారంలో విదేశి నిల్వలు భారీగా పెరిగాయి. 2023 మే 26వ తేదీన నమోదైన 589.13 బిలియన్ డాలర్ల కంటే.. 2023 జూన్ 2తేదీ నాటికి 5.92 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి, 595.06 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Also Read: PM Modi America Visit: అమెరికాలో ప్రధాని మోడీ పేరుతో కారు నంబర్ ప్లేట్
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్‌లో కీలక మార్పులు
మన దేశంలో ఫారిన్ కరెన్సీ నిల్వలు ఇప్పటికీ వాటి చారిత్రక గరిష్ఠ స్థాయి కంటే దాదాపు 52 బిలియన్ డాలర్లు తక్కువలో ఉన్నాయి. అయితే, ఈ అంతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంటే, భారత విదేశీ వాణిజ్యం పెరుగుతోంది. RBI డేటా ప్రకారం, జూన్ 9తేదీ నాటికి మన దేశంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.12 బిలియన్ డాలర్ల క్షీణతతో 525.07 బిలియన్ డాలర్లకు తగ్గాయి. జూన్ 2తో ముగిసిన వారంలో ఇవి 526.20 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు.
Also Read: Hyderabad: హైదరాబాద్ లో అమ్ముడు పోని ఇళ్లు.. కారణం ఏంటో తెలుసా..?
దేశంలో బంగారం నిల్వలు కూడా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తుంది. IMF వద్ద ఉన్న ఇండియా గోల్డ్ రిజర్వ్స్ 8 మిలియన్ డాలర్లు తగ్గి 5.11 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. అయితే గత వారంలో అవి 5.12 బిలియన్ డాలర్లు ఉండగా.. శుక్రవారం (జూన్ 16, 2023), అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడింది. డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్ వాల్యూ 25 పైసలు మెరుగుపడి రూ. 81.94 వద్ద ముగిసింది.
Also Read: Prabhas: పాన్ ఇండియా రూలర్!
భారతదేశ ఫారిన్ కరెన్సీ నిల్వలు 2021 అక్టోబర్ నెలలో 645 బిలియన్ డాలర్లతో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఇది, ఆల్ టైమ్ హై రికార్డ్.. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. దీంతో భారీగా విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వచ్చాయి.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!