ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ విజేత భారత్.. రికీ పాంటింగ్ జోస్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ricky Ponting Says India Extremely Hard To Beat for Any Team: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 విజేతగా టీమిండియా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతుండటం భారత్‌కు కలిసొస్తోందని, బలమైన జట్టుతో బరిలోకి దిగడం కూడా సానుకూలాంశంగా పేర్కొన్నాడు. భారత్‌ను ఓడించడమంటే ఇతర జట్లకు చాలా కష్టమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ 2023లో రోహిత్ సేన హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆసీస్, అఫ్గాన్, పాక్‌లపై భారత్ సునాయాస విజయాలు అందుకుంది.
రికీ పాంటింగ్ తాజాగా ఐసీసీ ఈవెంట్‌లో మాట్లాడుతూ… ‘భారత్‌ను ఓడించడం చాలా కష్టం అని ప్రపంచకప్ ప్రారంభానికి ముందు నుంచే చెబుతున్నా. భారత్ ప్రతిభావంతులైన జట్టును కలిగి ఉంది. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్.. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ అన్నీ బలంగా ఉన్నాయి. అందుకే టీమిండియాను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా కష్టమే. అయితే టోర్నీ ముగింపు నాటికి ఉండే తీవ్ర ఒత్తిడిని తట్టుకుని ఇదే ఊపును ఎలా కొనసాగిస్తుందో చూడాలి. ఒత్తిడిని అధిగమించడమే ఇక్కడ కీలకం’ అని అన్నాడు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
Also Read: Xiaomi HyperOS: 13 ఏళ్ల తర్వాత ఎంఐయూఐకి షావోమి గుడ్‌బై.. ఇకపై హైపర్ ఓఎస్!
‘రోహిత్ శర్మ ఆడుతున్న తీరును చూస్తే.. జట్టుకు అతడు ఎంత బలంగా మారాడో ఇట్టే అర్థమైపోతుంది. బ్యాటింగ్‌లో రాణిస్తూనే.. జట్టును కూడా ముందుండి నడిపిస్తున్నాడు. అది అద్భుతం అనే చెప్పాలి. అయితే టోర్నీ సాగే కొద్దీ ఒత్తిడి వారిపై ఉండదని కాదు. ఒత్తిడిని ముందుగా రోహిత్ తీసుకుని.. మిగతా వారూ దాన్ని ఎదుర్కొనేలా సిద్ధంగా ఉంచుతాడు. రోహిత్ అద్భుత నాయకత్వంతో విరాట్ కోహ్లీ వంటి వారికి మరింత స్వేచ్ఛ లభిస్తోంది. వారు తమ బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టేందుకు అవకాశం లభించింది. రోహిత్ సారథ్యంలో భారత్ విజేతగా నిలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’ అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!