ఆసియా క్రీడలు 2023లో టెన్నిస్‌లో పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఇండియా నంబర్-1 పురుషుల టెన్నిస్ జంట రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీలు మొదటి రౌండ్లోనే ఓటమి పాలయ్యారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 51,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు.
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. గత వారం చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు.. ఇండియాకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు వీసా సమస్యలు ఎదుర్కొంటుండగా.. తాజాగా శుభవార్త అందింది. ఈరోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా జారీ చేయనున్నారు.
ఆసియా క్రీడలు 2023లో టీమిండియా ఉమెన్స్ క్రికెట్ జట్టు పసిడిని ముద్దాడింది. మహిళల క్రికెట్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో శ్రీలంకపై భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం బౌలర్ల అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను 20 ఓవర్లలో 97 పరుగులకే పరిమితం చేసి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్ తర్వాత గిల్, అయ్యర్ ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడారు. ఆ వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. అందులో గిల్, శ్రేయాస్ అయ్యర్ ఒకరి గురించి ఒకరు సమాధానాలు చెప్పుకుంటారు.
KL Rahul hits a six on the Indore stadium roof: గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్ 2023 ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ చేశాడు. అదే ఫామ్ ఆస్ట్రేలియాపై కూడా కొనసాగిస్తున్నాడు. మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ (58) చేసిన రాహుల్.. రెండో వన్డేలో మరో హాఫ్…
Pat Cummins laughs after David Warner bats Right Handed: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లెఫ్టాండర్ అన్న విషయం తెలిసిందే. అయితే వేగంగా పరుగులు చేసేందుకు వార్నర్ అప్పుడప్పుడు తన స్టాన్స్‌ను మార్చుకుని రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తుంటాడు. ఇలా ఎన్నోసార్లు ఆడిన దేవ్ భాయ్.. సిక్సులు, బౌండరీలు కూడా బాదాడు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో కూడా వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన…
Shubman Gill and Shardul Thakur Out From IND vs AUS 3rd ODI: ఆదివారం ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట ఆస్ట్రేలియాను రాహుల్ సేన 99 పరుగుల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగులుండగానే మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ…
Punjab Students Parents worry about Study in Canada after India-Canada Issue: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణల తర్వాత ఇరు దేశాలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు ఇరు దేశాలు దౌత్య వేత్తలను కూడా బహిష్కరించాయి. కెనడా వీసాలను…