పాకిస్తాన్‌తో మాట్లాడటానికి భారతదేశం ఎప్పుడూ తలుపులు మూసుకోలేదు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అయితే, ఇస్లామాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి వచ్చిన చర్చలు జరిపితే ఇది సాధ్యం అవుతుందని తెలిపారు.
రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో మోడీ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) సంబంధించి దేశవ్యాప్తంగా అలజడి నెలకొంది. దేశవ్యాప్తంగా సీఏఏపై చర్చ మరోసారి తీవ్రమైంది. ఇంతకు ముందు కూడా పౌరసత్వ సవరణ చట్టంపై చాలాసార్లు వివాదాలు వచ్చాయి.
Pakistan: తప్పిపోయిన తమ దేశ మత్స్యకారుల జాడను కొనుక్కోవడానికి దాయాది దేశం పాకిస్తాన్, భారత్ సాయాన్ని కోరుతోంది. సింధ్ ప్రావిన్స్ లోని కేతి బందర్ పోర్టు సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో కనీసం 14 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, వీరి ఆచూకీ తెలుసుకోవడానికి భారతదేశం సాయాన్ని కోరాలని పాకిస్తాన్ చట్టసభ సభ్యులు ప్రధాని మంత్రి షెహబాజ్ షరీఫ్‌ని బలవంతం చేస్తున్నారు.
UN Security Council: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సంస్కరణపై మరోసారి భారత్ గళం విప్పింది. భద్రతా మండలి సంస్కరణలు చేపట్టాలని కోరింది. ఐరాసలో శాశ్వత ప్రతినిధి రుచిక కాంబోజ్ శనివారం న్యూయార్క్‌లో జరిగిన 78వ సెషన్ అనధికార సమావేశంలో యూఎన్ఎస్సీ సంస్కరణ ఆవశ్యతను ఎత్తి చూపారు. అర్ధశతాబ్ధంకి పైగా వీటిపై చర్యలు కొనసాగుతున్నాయని, ప్రపంచం మరియు భవిష్యత్ తరాలు ఇకపై వేచి ఉండలేవని అన్నారు.
Jaishankar: భారతదేశంలో రాబోయే 15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై నిక్కీ ఫోరమ్‌లో జైశంకర్ మాట్లాడారు. 95 కోట్ల మంది పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మేలో భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు వెళ్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. కాగా.. భారత్ 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) పరుగులతో ఉన్నారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ముగిసింది. ఈ మ్యాచ్ లో తొలిరోజు టీమిండియా ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (52), శుభ్‌మన్ గిల్ (26) పరుగులతో ఉన్నారు. కాగా.. యశస్వి జైస్వాల్ 58 బంతుల్లో 57 పరుగులు చేసి పెవిలియన్‌కు బాటపట్టాడు. షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు. రన్ మిషన్, కింగ్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఇంతకుముందు కోహ్లి 2016-17లో భారత్ లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 8 ఇన్నింగ్స్ ల్లో 109.2 రన్స్ చేశాడు. తాజాగా.. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్…
దేశ సరిహద్దుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం యుద్ధానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అన్నారు. ఎన్డీటీవీ తొలి డిఫెన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ మేము అన్ని సమయాల్లో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. శాంతి సమయంలో కూడా మేము సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ‘‘భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్‌పై దాడి చేస్తే మా బలగాలు ధీటుగా సమాధానమిస్తాయి. మేం ఏ దేశంపైనా దాడి చేయలేదు, ఎవరి భూమిలోనూ…