Wasim Akram Slams India Fans: రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల సందర్భంగానూ ప్రేక్షకులు అతడిని హేళన చేశారు. ముఖ్యంగా వాంఖడేలో ఫాన్స్ హార్దిక్‌ను ఆటాడుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్ తీరును తప్పుబట్టారు. అయినా వారిలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ ఫ్యాన్స్‌పై మండిపడ్డాడు. సొంత ఆటగాడినే హేళన చేస్తారా?, ఇకనైనా ట్రోలింగ్ ఆపండి అని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు.
వసీమ్ అక్రమ్ తాజాగా ఓ క్రీడా ఛానెల్లో మాట్లాడుతూ… ‘హార్దిక్ పాండ్యా విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆందోళనకరంగా మారింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఓ సమస్య ఉంది. ఏ విషయాన్ని మనం అంట ఈజీగా మరిచిపోం. హార్దిక్‌కు కొడుకు ఎప్పుడు పుట్టాడు, 20 ఏళ్ల కిందట అతడు ఎలా కెప్టెన్ అయ్యాడనే విషయాలను మన పిల్లలకూ చెబుతాం. ఇక నుంచైనా అభిమానులు నిశ్శబ్దంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతడు భారత ఆటగాడు. ముంబై జట్టుకు ఆడుతున్నాడు. మీ దేశాన్ని గెలిపించడానికి ఆడే ఓ ప్లేయర్’ అని అన్నాడు.
Also Read: T20 World Cup 2024: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. టీ20 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ!
‘2024 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు ముంబైకి ఇంకా అవకాశం ఉంది. సొంత ఆటగాడిని హేళన చేయడానికి మరే పాయింట్ మీ (ఫ్యాన్స్) దగ్గర లేదు. ఇప్పటికే అతడిపై విమర్శలు గుప్పించారు. ఇకనైనా విమర్శలను ఆపండి. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పులు సహజం. చెన్నై కెప్టెన్ మారాడు. జట్టు ప్రయోజనాల్లో భాగంగా కఠిన నిర్ణయాలు ఉంటాయి. ముంబై కూడా అలానే చేసి ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు ఉండవు. రోహిత్ శర్మను మరో ఏడాది పాటు కొనసాగిస్తే బాగుండేదని నా అభిప్రాయం. వచ్చే సీజన్‌లో హార్దిక్‌ను కెప్టెన్‌గా చేస్తే బాగుండేది. అప్పుడు ఎలాంటి వివాదం, విమర్శలు వచ్చేవి కావు’ అని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.