Missiles hit: ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం తర్వాత నుంచి ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హమాస్‌కి మద్దతు యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదాడులు వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఎర్ర సముద్రంలో తమ క్షిపణులు ఆండ్రోమెడ స్టార్ అనే చమురు నౌకని ఢీకొట్టినట్లు హౌతీలు శనివారం తెలిపారు. నౌకకు నష్టం వాటిల్లినట్లు షిప్ మాస్టర్ నివేదించినట్లు బ్రిటిష్ మెరైన్ సెక్యురిటీ సంస్థ ఆంబ్రే వెల్లడించింది.
Read Also: Yuvraj Singh: భారత్ వరల్డ్‌కప్ గెలవాలంటే.. వారు ఆ పని చేయాలి..!
హౌతీ ప్రతినిధి యాహ్యా సరియా మాట్లాడుతూ.. పనామా-ఫ్లా్గ్ ఉన్న ఓడ బ్రిటిష్ యాజమాన్యం కింద ఉందని చెప్పారు. ఈ నౌక రష్యాలోని ప్రిమోర్స్క్ నుంచి భారత్ లోని వదినార్కు వెళ్తున్నట్లు ఆంబ్రే తెలిపింది. ఇరాన్ ప్రాక్సీలుగా ఉన్న హౌతీ మిలిటెంట్లు నవంబర్ నుండి ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందాబ్ జలసంధి మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో పదేపదే డ్రోన్ మరియు క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ నౌకా వాణిజ్యంపై తీవ్ర పరిణామాలు చూపిస్తున్నాయి. ఇజ్రాయిల్ దానికి మద్దతు ఇచ్చే దేశాలకు చెందిన ఓడల్ని హౌతీలు టార్గెట్ చేస్తున్నారు.
USS డ్వైట్ D. ఐసెన్‌హోవర్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ సంకీర్ణ సేనలకు సాయం చేయడానికి శుక్రవారం సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రానికి బయలుదేరింంది. ఇదిలా ఉంటే యెమెన్‌లోని సాదా ప్రావిన్స్ గగనతలంలో అమెరికన్ MQ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు హౌతీలు శుక్రవారం తెలిపారు.