Sri Lanka: శ్రీలంకలో 60 మంది భారతీయుల అరెస్ట్.. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు గుర్తింపు
- ఈ దాడిలో 135 మొబైల్స్.. 57 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
- పశ్చిమ తీర నగరమైన నెగోంబో వారిని అరెస్ట్ చేసిన సీఐడీ
- నిందితులకు దుబాయ్.. ఆఫ్ఘనిస్తాన్ తో కూడా సంబంధాలు ఉన్నట్లు వెల్లడి
- అక్రమ బెట్టింగ్‌లు.. జూదం వంటి పలు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడిన 60 మంది భారతీయులను శ్రీలంకలోక్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అరెస్టు చేసింది. కొలంబోలోని మడివెల, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుంచి వారిని గురువారం అరెస్టు చేశారు. ఈ దాడిలో 135 మొబైల్స్, 57 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి ఎస్‌ఎస్‌పి నిహాల్ తల్దువా తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. అనుమానంతో నెగొంబోలోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు లభించాయి. మొదటగా13 మంది అనుమానితులను ప్రాథమికంగా అరెస్టు చేశారు. వారి నుంచి 57 ఫోన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఆపరేషన్ల ఫలితంగా మిగతా వారిని మందిని అరెస్ట్ చేశారు. వీరికి అక్కడే ఉంటున్న ఓ కుటుంబం సహాయం చేస్తున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో నగదు ఇస్తామని చెప్పి బాధితురాలిని వాట్సాప్ గ్రూప్‌లోకి లాక్కెళ్లారు. ప్రాథమిక చెల్లింపు తర్వాత మిగిలిన డబ్బును డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేసినట్లు విచారణలో వెల్లడైంది.
READ MORE: Darshan controversies: మర్డర్ కేసు మాత్రమే కాదు.. దర్శన్ వివాదాల లిస్టు చూశారా?
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
అంతర్జాతీయ సంబంధాలు బహిర్గతం..
ఈ వ్యక్తులకు దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్ తో కూడా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు బహిర్గతమయ్యాయి. బాధితుల్లో స్థానికులు, విదేశీయులు కూడా ఉన్నారని నివేదిక పేర్కొంది. వీరు ఆర్థిక మోసాలు, అక్రమ బెట్టింగ్‌లు, జూదం వంటి పలు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!