అమెరికా, వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికాతో టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జోడీ మొత్తం 6 వికెట్లు పడగొట్టింది. దీంతో.. సెమీస్‌లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించగలిగింది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్‌పై…
Amartya Sen: లోక్‌సభ ఎన్నికలపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ హిందూదేశం కాదని ఇటీవల లోక్‌సభ ఎన్నికలు నిరూపించాయని అన్నారు.
Alcohol : మద్యం వల్ల ఏటా 26 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది మద్యం, మాదక ద్రవ్యాల వల్ల వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు.
భారత స్పిన్నర్ల మాయాజాలంతో టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించడానికి రంగంలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ చేతులెత్తేయడంతో 16.3 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో.. టీమిండియా ఫైనల్స్‌కు చేరింది. ఈ ఆనందంలో రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో.. భారత్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. 68 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 16.4 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ను 103 పరుగులకు ఆలౌట్ చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ బౌలర్ల ధాటికి తడబడ్డారు. కేవలం జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్ ఈ ముగ్గురే 20 పరుగుల…
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. కాసేపట్లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరుగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్.. గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. రాత్రి 7.30 గంటలకు టాస్ జరిగి.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం పడటంతో ఆలస్యమైంది.
కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్ కు ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే అప్పటివరకు వాన తగ్గుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాగా.. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించానున్నారు. లేదంటే..…