T20 World Cup 2024 : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా మరో సంచలనం నమోదయింది. నేడు సూపర్ 8 లో భాగంగా కింగ్స్టన్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులను చేసింది. ఇందులో కెప్టెన్ రహముల్లా 49…
గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. రెండు సంవత్సరాల క్లిష్టతరమైన ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక కోలుకున్నదని, భారతదేశం నుంచి అందుకున్న 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం వల్ల ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శనివారం అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న టి20 పురుషుల ప్రపంచ కప్ నేపథ్యంలో భాగంగా సూపర్ 8లో నేడు టీమిండియా బంగ్లాదేశ్ తో తలబడుతోంది. ఇదివరకు సూపర్ 8లో మొదటి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ టోర్నీలో 47వ మ్యాచ్ గా నార్త్ సౌండ్ లో గ్రూప్ వన్ స్టేజిలో భాగంగా జరుగుతోంది. నేడు ఆడబోయే మ్యాచ్ ఆటగాళ్ల…
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 53వ సమావేశం శనివారం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను తెలియజేసి కీలక నిర్ణయాలను వెల్లడించారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో ఉన్నారు. షేక్ హసీనాతో చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్, బంగ్లాదేశ్‌లు అంగీకరించాయని, మొత్తం సంబంధాలను పెంపొందించేందుకు భవిష్యత్తు దృష్టిని రూపొందించుకున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని, ఆ దేశంతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొత్త రంగాలలో భారతదేశం-బంగ్లాదేశ్ సహకారానికి భవిష్యత్తు దార్శనికత సిద్ధమైందని ప్రధాని మోడీ తెలిపారు. డిజిటల్…
Hyderabad No-1: హైదరాబాదీలు ఆర్థిక క్రమశిక్షణలో ఎవరికీ సాటి కాదని నిరూపించారు. మొత్తం దేశంలోనే హైదరాబాద్ వాసులు పొదుపులో నెం.1గా ఉన్నారని 'ది గ్రేట్ ఇండియన్ వాలెట్' ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
Hajj pilgrimage: ఈ ఏడాది హజ్ యాత్రలో యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. విపరీతమైన వేడి కారణంగా వీరింతా ప్రాణాలు వదులుతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకారం.. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1000ని దాటింది.
1985 Air India bombing: జూన్ 23, 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడి భారత్ ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ ఏడాదితో ఈ ఉగ్రఘటనకు 39 ఏళ్లు. ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా నుంచి ఇండియాకు వస్తున్న ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానాన్ని బాంబులతో పేల్చేశారు.