ఈ మధ్య కాలంలో జమ్మూ అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోయింది. సామాన్య ప్రజలతో పాటు సైన్యం కూడా తీవ్రవాదుల వలలో చిక్కుకుంది. పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
India vs China: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో డ్రాగన్ కంట్రీ చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల వరదలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా.. గ్రూప్-A తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ సూపర్ విక్టరీ సాధించింది. 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 108 పరుగులు చేసింది. దీంతో.. 109 రన్స్ టార్గెట్తో భారత్ రంగంలోకి దిగిన ఈజీగా విక్టరీ సాధించింది. భారత్ బ్యాటింగ్ లో స్మృతి మంధాన అత్యధికంగా (45) పరుగులు చేసింది. ఆ తర్వాత.. షఫాలీ వర్మ (40)…
బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా.. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. శుక్రవారం కోల్కతాలో సీఐఎల్ (కోల్ ఇండియా లిమిటెడ్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి.. అనంతరం ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. భారతదేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర…