విదేశాల్లో భారతీయ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉందని ఎగుమతి లెక్కలు చెబుతున్నాయి. సోమవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక వాణిజ్య డేటా ప్రకారం.. భారతదేశం మొత్తం ఎగుమతులు (వస్తువులు మరియు సేవలతో సహా) ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో $200.3 బిలియన్లకు చేరాయి.
Ram Setu: భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (isro) వెల్లడించింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను ఇస్రో శాస్త్రవేత్తలు రిలీజ్ చేశారు.
జింబాబ్వేతో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా బౌలర్లు మరోసారి అదరగొట్టడంతో గెలుపొందారు. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
జింబాబ్వే జరుగుతున్న చివరి టీ20లో భారత్ 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి జింబాబ్వే ముందు 168 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. భారత్ బ్యాటింగ్లో సంజా శాంసన్ (58) పరుగులతో రాణించాడు.
ఇండియా-జింబాబ్వే మధ్య ఈరోజు ఐదో టీ 20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్కు దిగనుంది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి 4-1 తేడాతో ముగించాలని టీమిండియా చూస్తోంది.