రాజస్థాన్లోని అజ్మీర్లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది.
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వరుసగా మూడో మ్యాచ్లో గెలిచింది భారత్. 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Vulture Population: మానవుల అకాల మరణాలకు, భారతదేశంలో క్షీణిస్తున్న ‘రాబందుల’ జనాభాకు సంబంధం ఉందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ పర్యావరణ విపత్తు ఫలితంగా 2000 నుంచి 2005 వరకు అర మిలియన్ మంది మానవులు అకాల మరణం చెందినట్లు తెలిపింది.
చైనా ఎప్పుడూ తన పొరుగు దేశాలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొదట సహాయం పేరుతో అప్పు ఇచ్చి, ఆ తర్వాత తన బలగాలను వారి ప్రాంతంలో మోహరించడం ప్రారంభిస్తుంది.